వింత ఆచారం.. అక్కడ పెళ్లి ముందే పిల్లల్ని కనొచ్చు!

by Yella Dhawani Reddy |

భారతదేశం అంటే.. భిన్నంలో ఏకత్వం (Unity in Diversity) అని అందరికి తెలిసిందే.

వింత ఆచారం.. అక్కడ పెళ్లి ముందే పిల్లల్ని కనొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం అంటే.. భిన్నంలో ఏకత్వం (Unity in Diversity) అని అందరికి తెలిసిందే. ఎన్ని మతాలు, ఎన్ని ఆచార, సంప్రదాయాలు ఉన్న మన దేశంలో వివాహ బంధానికి ఇచ్చే విలువకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడిన పెళ్లి (Marriage) తర్వాతే వాళ్లిద్దరూ కలిసి ఉండటం మన సంప్రదాయం. అంతేకానీ, పెళ్లి ముందే సహజీవనంలో (Live in relationship) ఉంటామంటే అస్సలు ఒప్పుకోరు. సహజీవనాన్ని ఓ ప్రాశ్చాత్య సంస్కృతిగా మన భారతీయులు భావిస్తారు. కానీ, మన దేశంలోని ఓ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి సహజీవనం సంప్రదాయంగా వస్తుంది. అక్కడి అమ్మాయిలు.. తమకు నచ్చిన అబ్బాయిలను ఎంచుకుని సహజీవనం చేయొచ్చు. అంతేకాదు, పిల్లల్ని కనొచ్చు. నచ్చకపోతే విడిపోవచ్చు కూడా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే. మరీ ఈ వింత ఆచారాలున్న ప్రాంతం ఎక్కుడుందీ? దాని విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

రాజస్థాన్ (Rajasthan), గుజరాత్ (Gujarat) రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో 'గరాసియా' (Garacia) అనే తెగల వారు నివసిస్తుంటారు. ఈ తెగ సంప్రదాయం ప్రకారం.. పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకుని వారితో కలిసి సహజీవనం సాగించవచ్చు. ఇందుకోసం ఈ తెగ వారు రెండు రోజుల పాటు జాతర కూడా నిర్వహిస్తారు. జాతరలో యువతీ యువకులు తమకు నచ్చిన వాళ్లను ఎంచుకుని పెద్దలకు చెప్పి సహజీవనం మొదలుపెడుతారు. ఈ క్రమంలో వారు పిల్లల్ని కూడా కనొచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ సహజీవనంలో ఉన్న భాగస్వామి తమను వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేమని నిర్ణయించుకున్నా.. ఈ బంధం నుంచి స్వాతంత్య్రంగా బయటికి వచ్చే స్వేచ్ఛ ఈ తెగ అమ్మాయిలకు ఉంది.

అయితే ఇక్కడ ఓ కండిషన్ ఉంది. సహజీవనం చేసే అబ్బాయి కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి అందించి వారితో సహజీవనాన్ని మొదలుపెట్టిస్తారు. భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలనుకున్న కూడా పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారు. ఈ ఆచారాన్ని అక్కడి తెగ వారు 'దాపా'గా పిలుస్తారు. అలాగే, వరుడి ఇంట్లోనే పెళ్లి వేడుకలన్నీ ఘనంగా నిర్వహిస్తారు. వందల ఏళ్ల నుంచి గరాసియా తెగ ప్రజలు ఇవే సంప్రదాయాల్ని పాటిస్తున్నారు. పైగా ఈ వింత ఆచారాలే వరకట్న వేధింపులు, మరణాలు, అమ్మాయిలపై అత్యాచారాలు వంటివెన్నో తగ్గించాయని అక్కడి వారు చెబుతున్నారు.

Next Story