- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురావస్తు ప్రేమ అంటా.. సోషల్ మీడియాలో స్టోరీ చదివి నవ్వుకున్నా.. కానీ గట్టి రియలైజేషన్..
పురావస్తు ప్రేమ.. సోషల్ మీడియాలో స్టోరీ చదివి కాసేపు నవ్వుకున్నా.. కానీ నిజమే కదా అనిపించింది. అసలు విషయం ఏంటంటే.. భార్యాభర్తలు మంచి జాబ్స్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో చిన్న కుటుంబం.

దిశ, ఫీచర్స్ : పురావస్తు ప్రేమ.. సోషల్ మీడియాలో స్టోరీ చదివి కాసేపు నవ్వుకున్నా.. కానీ నిజమే కదా అనిపించింది. అసలు విషయం ఏంటంటే.. భార్యాభర్తలు మంచి జాబ్స్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో చిన్న కుటుంబం. వాళ్లు అడిగింది కొనిచ్చి.. హ్యాపీగా ఉంచేందుకు ఆర్థికంగా కూడా బాగానే ఉన్నారు. కుదిరితే కాసేపు ముచ్చట్లు. లేదంటే డెయిలీ రొటీన్‌లో చిక్కుకుని.. రాగానే కాస్త తినేసి రిలాక్స్ అయిపోతారు. ఈ క్రమంలో కొద్దిగా+ శారీరక దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌ను కలిశారనుకోండి.. అక్కడ జరిగే పార్టీలో కాలేజీ ముచ్చట్లు గుర్తుకొస్తాయి. అప్పటి ప్రేమలు మనసులో తిరిగేస్తాయి. అంతే.. సోషల్ మీడియా ఓపెన్ చేసి అందులో ఎకౌంట్ ఉంటే.. హాయ్ మెసేజ్ పెట్టేస్తారు. అవతలి వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారనుకోండి.. అల్లుకుపోతారు.
దీంతో చింతలు లేని చిన్న కుటుంబంలోకి.. పెద్ద బాధలకు చోటు లభిస్తుంది. ఇల్లీగల్ రిలేషన్ స్టార్ట్ అయిపోయి.. లీగల్ పెళ్లిలో ఘర్షణలు స్టార్ట్ అవుతాయి. భాగస్వామి చీదరింపులు.. పిల్లల అమాయకపు చూపులు.. అన్నీ కలిసి పిచ్చెక్కినట్లవుతుంది. అప్పుడు అనిపిస్తుంది. అంత బాగున్న లైఫ్‌ను ఎందుకిలా చేసుకున్నానా అని. పరిస్థితి విషమించితే విడాకులే గతి అవుతుందనుకోండి అది వేరే కథ. మీమ్స్‌లో చెప్పినట్లు ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ యు లాస్ట్ డైమండ్ అన్నట్లు అవుతుంది. సో.. కాలేజీ పురావస్తు ప్రేమలను తలుచుకుని.. మనసులోనే ఆనందం పొందితే ఓకే కానీ ఇన్‌స్టా ఉంది కదా ఇన్‌స్టాంట్ శాటిస్‌ఫాక్షన్ పొందుదామంటే కథ అడ్డం తిరుగుతుంది. అసలు లైఫ్‌లో లైఫే లేకుండా పోతుంది. అదీ మ్యాటర్.. ఈ స్టోరీ చదివి కొద్ది మంది రియలైజ్ అయినా బాగుంటుంది కదా.






