Health Tips : ఆరోగ్యంగా ఉండాలా...ఇంకెందుకు ఆలస్యం!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 12:20:32  IST  )

మానవుల్లో ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తి(Health and Immunity)ని కల్పించేందుకు నిపుణులు తాజాగా ఓ ఆహార జాబితాతో కూడిన హెల్త్ టిప్సును(Health Tips) వెల్లడించారు.

Health Tips : ఆరోగ్యంగా ఉండాలా...ఇంకెందుకు ఆలస్యం!
X

దిశ, వెబ్ డెస్క్: మానవుల్లో ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తి(Health and Immunity)ని కల్పించేందుకు నిపుణులు తాజాగా ఓ ఆహార జాబితాతో కూడిన హెల్త్ టిప్సును(Health Tips) వెల్లడించారు. ఆరోగ్య కారకాలు..రోగ నిరోధకాలైన 13 శక్తివంతమైన విటమిన్లు(13 Powerful Vitamins), వాటి ఆహార వనరులను ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్టు హెల్త్ టిప్స్ పేరుతో విడుదల చేసింది.

అందులో ప్రధానంగా 1)విటమిన్ ఎ (రెటినోల్) - "విజన్ ప్రొటెక్టర్ కోసం క్యారెట్లు, చిలగడదుంపలు, బచ్చలికూర, గుమ్మడికాయ, మామిడికాయల నుంచి లభిస్తుందని తెలిపారు. 2)విటమిన్ B1 (థయామిన్) - "ఎనర్జీ బూస్టర్" అని..ఇది బ్రౌన్ రైస్ , శనగలు, పప్పు, గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చిక్కుళ్ళలో లభిస్తుంది. 3). విటమిన్ B2 (రిబోఫ్లావిన్) - "సెల్ రిపేరర్" అని..బాదం,పుట్టగొడుగులు, పాలకూర, అవకాడోస్, సోయాబీన్స్ , బ్రోకలీ ద్వారా సమకూరనుంది. 4) విటమిన్ B3 (నియాసిన్) - "హార్ట్ హెల్పర్" అని.. వేరుశెనగ, శనగలు, హోల్ వీట్ , కాలీఫ్లవర్ , పప్పు, సోయాబీన్స్ తినడం ద్వారా పొందవచ్చు. 5) విటమిన్ B5 (పాంతోతేనిక్ యాసిడ్) - "స్ట్రెస్ ఫైటర్" అని..అవకాడోస్, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, బ్రోకలీ, స్వీట్ పొటాటోస్ ల ద్వారా లభించే మంచి ఆరోగ్యకారకం. 6)విటమిన్ B6 (పిరిడాక్సిన్) - "మూడ్ బ్యాలెన్సర్" అని..బనానాస్ చిక్పీస్, బంగాళదుంపలు, పాలకూర, పిస్తాపప్పు, వెల్లుల్లిల ద్వారా లభిస్తుంది.

7) విటమిన్ B7 (బయోటిన్) - "బ్యూటీ విటమిన్" అని, బాదం, ఆక్రోట్లను, వేరుశెనగ, తృణధాన్యాలు, అరటిపండ్లు, కాలీఫ్లవర్ ల మనకు లభిస్తుంది. వీటిని మనం తరుచుగా తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు అందం కూడా పొందవచ్చు. 8) విటమిన్ B9 (ఫోలేట్) - "బ్లడ్ బిల్డర్" అని, చిక్పీస్ , బ్లాక్ బీన్స్ , ఆస్పరాగస్ , అవకాడోస్ , దుంపలు, నారింజలు ద్వారా లభిస్తుంది. 9)విటమిన్ B12(కోబాలమిన్) - "మెదడు & కండరాల డిఫెండర్" అని, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, జనపనార విత్తనాలు , నువ్వులు, చియా విత్తనాల స్వీకరణ ద్వారా పొందవచ్చు. 10)విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) - "ఇమ్యూనిటీ బూస్టర్" అని, స్ట్రాబెర్రీలు, నారింజ, కివీ, బొప్పాయి, బెల్ పెప్పర్స్, టమోటాలు నుంచి తీసుకుని మంచి రోగ నిరోధక శక్తిని సాధించవచ్చు.

11) విటమిన్ డి(కాల్సిఫెరోల్) - "సన్‌షైన్ విటమిన్" అని, ఆవు పాలు, పుట్టగొడుగులు, ఆకు కూరలు, చీజ్, నువ్వుల గింజల ద్వారా లభిస్తుంది. 12) విటమిన్ E(టోకోఫెరోల్) - "స్కిన్ షీల్డ్" అని, బాదం, పాలకూర, అవకాడోస్, వేరుశెనగ, ఆలివ్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ద్వారా లభిస్తుంది. 13) విటమిన్ K(ఫైలోక్వినోన్) - "క్లాట్ కంట్రోలర్" అని, బ్రోకలీ, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, సోయాబీన్స్, పచ్చి బఠానీల నుంచి పొందడం ద్వారా మనలోని కొవ్వును నియంత్రించుకోవచ్చు. అయితే వైద్యులు, న్యూట్రిషియన్ల సలహా లేకుండా విటమిన్ సప్లిమెంట్లను ఎప్పుడూ తీసుకోవద్ధని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story