- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రోన్‌లో వెళ్లి.. రోబోలే సర్జరీ చేస్తాయ్!!
సైనికులకు అత్యవసర ఆరోగ్య పరిస్థితి తలెత్తితే ‘డ్రోన్-మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్’ వెంటనే పరిష్కరిస్తుంది.

దిశ, ఫీచర్స్ : మనకు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తితే దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు వెళ్తాం. అవసరమైన ట్రీట్మెంట్ చేయించుకుంటాం. కానీ దేశం కోసం పనిచేస్తూ, దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులకో, వైద్య, రవాణా సౌకర్యంలేని ప్రాంతాల్లోని ప్రజలకో ఇలా జరిగితే..? వెంటనే ట్రీట్మెంట్ అందే చాన్స్ ఉండదు కదా! అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కనుగొన్నది హర్యానాకు చెందిన ‘SS Innovations International’ కంపెనీకి చెందిన పరిశోధకులు. వీరు ప్రాజెక్ట్ విమాన (SSi Vimana Aero) అనే అద్భుతమైన ‘డ్రోన్-మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. యుద్ధరంగంలో గాయపడిన సైనికులకు తక్షణమే శస్త్రచికిత్సలు అందించడమే ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా పని చేస్తుంది?
యుద్ధరంగంలోని సైనికులు లేదా రిమోట్ ఏరియాల్లోని ప్రజలకు అత్యవసర ఆరోగ్య పరిస్థితి తలెత్తితే ‘డ్రోన్-మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్’ వెంటనే పరిష్కరిస్తుంది. ఉదాహరణకు హెవీ-లిఫ్ట్ అటానమస్ డ్రోన్ ద్వారా ఒక చిన్న శస్త్రచికిత్స యూనిట్‌ను గాయపడిన సైనికుడి పక్కన ల్యాండ్ చేసి, మైళ్ల దూరంలో ఉన్న రిమోట్‌గా ఆపరేషన్ చేయవచ్చు. ఈ సాంకేతికత దూరంలో తనను పర్యవేక్షిస్తూ ఆపరేట్ చేస్తున్న సర్జన్ సలహాలను పాటిస్తూ అమలు చేస్తుంది. రక్తస్రావం కాకుండా ఆపడం, సీపీఆర్(CPR) చేయడం, ష్రాప్నెల్ తొలగించడం, గాయాలను కుట్టడం వంటి కీలక చికిత్సలు చేసి, సైనికుడిని ప్రాణాపాయం కాపాడు స్థిరపరుస్తుంది.
అధునాతన ఫీచర్లు
డ్రోన్-మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌లో డ్రోన్ ఒక కాంపాక్ట్ రోబోటిక్ యూనిట్‌ను మోసుకెళ్లడంవల్ల శస్త్రచికిత్స కూడా సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో రెండు మినియేచర్ రోబోటిక్ ఆర్మ్‌లు(7 డిగ్రీల ఫ్రీడమ్‌తో), అలాగే 5 మిల్లీమీటర్ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్లు ఉంటాయి. సర్జన్ రిమోట్ కమాండ్ సెంటర్ నుంచి లైవ్ కెమెరాలు చూస్తూ ఆపరేట్ చేస్తారు. దీంతో ఇది సాంప్రదాయ తరలింపు ఆలస్యాన్ని(Evacuation delay)తగ్గించి ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందిస్తుంది.
యుద్ధం నుంచి విపత్తుల వరకు
2026లో ఎస్‌ఎస్‌ఐ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ కాన్ఫరెన్స్‌లో ఈ అద్భుతమైన సాంకేతికను ఆన్‌వీల్ చేశారు. ప్రస్తుతం ఇంకా డెవలప్మెంట్ దశలో ఉంది. కాగా ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో సైనికులకు సేవలు అందించడంతోపాటు విపత్తు ప్రాంతాలు, రిమోట్ గ్రామాలు, రవాణా సౌకర్యంలేని అటవీ ప్రాంతాల్లో కూడా ఎమర్జెన్సీ కేర్‌ను మార్చేస్తుందని నిపుణులు అంటున్నారు. చికిత్స ఆలస్యంవల్ల మరణాలు జరగకుండా జీవితాలను కాపాడుతుందని చెబుతున్నారు.






