- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీదరించుకున్న సమాజం చేతే జేజేలు కొట్టించిన శ్రీవత్సవ్
అతనితో మాట్లాడటం మానేశారు

దిశ, ఫీచర్స్: 45 ఏళ్ల శ్రీవత్సన్ చిన్నతనంలోనే తాను భిన్నమైనవాడని గ్రహించాడు. తన సోదరుల కంటే కజిన్ సోదరీమణులతో ఎక్కువ సౌకర్యంగా ఉండేవాడు. తన మొదటి ప్రేమ ఒక నీలి కళ్ల బాలుడిపై. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లు లేని ఆ రోజుల్లో భారతదేశంలో ఎల్‌జిబిటిక్యూ సమాజం బహిరంగంగా లేదు. తన భావాలను పంచుకోవడానికి ఎవరూ లేక శ్రీవత్సన్ 20 ఏళ్ల వయసులో తీవ్ర మానసిక వేదనను అనుభవించాడు. తన లైంగిక ధోరణిని తొలిసారి వాళ్ల నాన్న స్నేహితుడితో పంచుకున్నప్పుడు ఆ విషయం నాన్నకు చేరింది. పూజారిగా ఉన్న శ్రీవత్సన్ వాళ్ల నాన్న అతన్ని కన్వర్షన్ థెరపీకి పంపాడు. అతనితో మాట్లాడటం మానేశారు. అతని గుర్తింపును సిగ్గుచేటుగా భావించారు. ఒకమ్మాయితో పెళ్లి చేస్తే అంతా సర్దుకుపోతుందని వాళ్లనుకుని శ్రీవత్సవ్‌ను ఒప్పించారు. తల్లిదండ్రుల అంగీకారం కోసం శ్రీవత్సన్ ఒక అమ్మాయిని కలిశాడు. కానీ తన ఆనందాన్ని త్యాగం చేయలేనని గ్రహించాడు. తీవ్ర నిరాశలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 26 ఏళ్ల వయసులో శ్రీవత్సన్ సింగపూర్‌కు వెళ్లాడు. అక్కడ స్వీయ-అంగీకారం, స్వేచ్ఛను కనుగొన్నాడు. మిత్రుల సహాయంతో తన గుర్తింపును ప్రేమించడం నేర్చుకున్నాడు. ఒక డేటింగ్ సైట్ ద్వారా చెన్నయ్‌కి చెందిన సరవణన్‌ను కలిశాడు. సరవణన్ తొలి డేట్‌లోనే ప్రేమలో పడ్డాడు. కానీ శ్రీవత్సన్‌కు అది క్రమంగా అర్థమైంది. 2018లో శ్రీవత్సన్, సరవణన్ కెనడాకు వలస వెళ్లి అదే ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. శ్రీవత్సన్ తల్లి తన కుమారుడిని అంగీకరిస్తూ వివాహంలో అతన్ని నడిపించింది. కెనడా చట్ట వ్యవస్థ ద్వారా సేంధన్‌ను 2022లో దత్తత తీసుకున్నారు.






