Sprouted Potatoes: మొలకెత్తిన ఆలుగడ్డలు శరీరానికి మంచిది కాదా..?

by Kanadam.Hamsa lekha |   (  Updated:2024-12-07 16:21:40  IST  )

చాలామంది మొలకెత్తిన విత్తనాలను ఆరోగ్యంగా ఉండడం కోసం తింటుంటారు.

Sprouted Potatoes: మొలకెత్తిన ఆలుగడ్డలు శరీరానికి మంచిది కాదా..?
X

దిశ, ఫీచర్స్: చాలామంది మొలకెత్తిన విత్తనాలను ఆరోగ్యంగా ఉండడం కోసం తింటుంటారు. ఇవి శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తాయి. అలా అని మొలకలు ఉన్నాయి కదా అని.. మొలకెత్తిన బంగాళ దుంపలను తింటే.. ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా బంగాళదుంపలు ఉంటాయి. వీటితో రకరకాల కూరలను టేస్టీగా చేసుకోవచ్చు. అయితే, చాలామంది దుంపలపై మొలకలు వస్తే ఏం కాదులే అని వాటిని అలాగే వండేస్తారు. నిజానికి బంగాళ దుంపలపై వచ్చే మొలకలు విషపూరితమైనవి. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్‌ అయ్యే చాన్స్ ఉంటుంది.

బంగాళ దుంపలపై ఏర్పడే మొలకల్లో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే విషయపూరితమైన రసాయన పదార్థాలు ఉంటాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మొలకెత్తినవి లేదా ఆకుపచ్చగా మారిన బంగాళ దుంపల్లో సోలనైన్, చాకోనైన్ ఉత్పత్తి అవుతుంది. వీటిలో హానిరకపు టాక్సిన్‌లు ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల వాంతులు, కడుపులో నొప్పి, వికారం వంటి సమస్యలకు కారణం కావొచ్చు. అంతేకాకుండా తలనొప్పి, తల తిరగడం వంటి నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. మధుమేహం ఉన్న వారు మొలకెత్తిన దుంపలు తింటే చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.

అందుకే మార్కెట్‌లో వీటిని కొనే ముందు మొలకలు లేనివి తీసుకోవాలి. బంగాళా దుంపలను ఇంట్లో ఎక్కువగా నిల్వ చేయకపోవడమే మంచిది. ఒకవేళ ఇంట్లో నిల్వ చేసినట్లైతే.. చల్లటి, పొడి ప్రదేశంలో నిల్వ చేయకూడదు. అలా అని ఉల్లిపాయలు పెట్టే ప్రదేశంలో వీటిని అస్సలు ఉంచకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే వీటిని కొనుగోలు చేయడం మంచిది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Strong tea: స్ట్రాంగ్ టీ తాగే అలవాటు మీకు ఉందా..? అయితే, సమస్యే..!


Next Story