వస్తువుల కొనుగోలుకంటే.. ఆ విషయంలో డబ్బు ఖర్చు చేసేవారు హ్యాపీగా ఉంటారు..!

by Javid Pasha |

కొత్త ఫోన్, కొత్త బట్టలు, గాడ్జెట్స్ వంటివి కొనుగోలు చేయడం కంటే కూడా ప్రయాణాలు, కచేరీలు, ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ చేయడం వంటి వాటికి డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ సంతోషాన్నిస్తుందని ఒక అద్యయనం పేర్కొన్నది.

వస్తువుల కొనుగోలుకంటే.. ఆ విషయంలో డబ్బు ఖర్చు చేసేవారు హ్యాపీగా ఉంటారు..!
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో కొన్ని సంతోషాలు డబ్బుతో ముడిపడి ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అయితే వాటిని ఎలా ఖర్చు చేస్తామనే దానిని బట్టి కూడా అవి ప్రభావితం అవుతాయని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా వస్తువుల కొనుగోలుకు చేసే ఖర్చుకుంటే.. అందమైన ప్రదేశాలు, ప్రయాణాలు, ఈవెంట్లు వంటివాటిపై ఖర్చు చేయడం మరింత ఆనందాన్ని, మధురమైన అనుభూతిని, మరిచిపోలేని అనుభావాన్ని కలిగిస్తుందని వెల్లడించింది.

డబ్బును దేనిపై ఖర్చు చేయడం ప్రజలకు ఎక్కువ సంతోషాన్నిస్తుందో తెలుసుకునే ఉద్దేశంతో బౌల్డర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లీఫ్ వాన్ బోవెన్ నేతృత్వంలోని నిపుణుల బృందం అమెరికాలోని 12,000 కంటే ఎక్కువ మందిని ప్రశ్నించింది. కాగా ఈ సందర్భంగా దాదాపు 94% మంది కొత్త ఫోన్, కొత్త బట్టలు, గాడ్జెట్స్ వంటివి కొన్నప్పుడు సంతోషం కలిగినా అది తాత్కాలికమేనని, అందుకు భిన్నంగా ప్రయాణాలు, కచేరీలు, ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ చేయడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం వంటి వాటికి డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టినప్పటికీ ఆ అనుభవాల వల్ల వచ్చే సంతోషం దీర్ఘకాలంపాటు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని, మధురానుభూతికి లోను చేస్తుందని పార్టిసిపెంట్స్ అభిప్రాయపడినట్లు అధ్యయనం తెలిపింది. పైగా అనుభవాల కోసం ఖర్చు చేయడం అనేది ఐడెంటిటీని బలపరుస్తాయని, ఇతరులతో అనుబంధాన్ని పెంచుతాయని కూడా నిపుణుల చెబుతున్నారు.

Next Story