- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
90 నిమిషాలు నేచర్‌తో కనెక్ట్ అవ్వండి చాలు.. మీ మెదడు పని తీరులో ఊహించని సానుకూల మార్పులు చూస్తారు..!
90 నిమిషాలు నేచర్‌తో కనెక్ట్ అవ్వండి చాలు.. మీ మెదడు పని తీరులో ఊహించని సానుకూల మార్పులు చూస్తారు..!

దిశ, ఫీచర్స్ : ప్రకృతికి, మానవ జీవితానికి అనేక విషయాల్లో అవినాభావ సంబంధం ఉంటుందనే విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతితో కనెక్ట్ అవ్వకుండా జీవించలేరు. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించడంలో ఈ చర్య కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనాలు సైతం పేర్కొన్నాయి. కాగా రీసెంట్ స్టడీ మరికొన్ని విషయాలను సైతం రివీల్ చేసింది. కేవలం 90 నిమిషాలపాటు పచ్చని ప్రకృతిలో గడిపితే మెదడు పనితీరులో చురుకైన సానుకూల మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నది.
*వాస్తవానికి పచ్చిక బయళ్లు, పచ్చని చెట్లు, పొదలు వంటివి కనువిదం చేయడమే కాదు, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఎఫ్ఎంఆర్ఐ, ఈసీజీ వంటి బ్రెయిన్ స్కాన్‌ల ద్వారా ఇది నిరూపితమైందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎందుకంటే హరిత ప్రదేశాలు అమిగ్డాలా వంటి ఒత్తిడికి సంబంధించిన మెదడు భాగాలను ప్రభావితం చేసి, స్ట్రెస్ రిలేటెడ్ డిఫాల్ట్ మోడ్ నెట్ వర్క్‌ను శాంతపరుస్తాయి. ముఖ్యంగా సబ్‌జెన్యుయల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో (The part about anxiety and self-criticism) ఒత్తిడి కలిగించే కార్యకలాపాలు తగ్గుతాయి. ఫలితంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. అందుకే పార్కులో, అడవిలో ఎక్కడైనా సరే ప్రకృతి నడుమ చిన్న నడక కూడా మెదడును శాంతపరచి, రీసెట్ చేయడానికి సహాయపడుతుంది.
*నేచర్‌తో కనెక్ట్ అవడంవల్ల వివిధ కారణాలవల్ల ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆందోళన స్థాయిలు సైతం తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, ఆకుపచ్చని పరిసరాలు మానసిక స్థితిని ఉత్తేజపరిచి, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి. శుద్ధమైన గాలి, సూర్యరశ్మి (విటమిన్ డి) రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ప్రకృతి మనసును రిఫ్రెష్ చేసి, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ప్రకృతిలో గడపడం సహజ నిద్ర చక్రాన్ని (Natural sleep cycle) సమతుల్యం చేస్తుంది. మొత్తంగా మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరుతాయి.






