90 సెకన్ల ముందే పేపర్ లాక్కున్నారు.. ప్రభుత్వంపై దావా వేసిన విద్యార్థులు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-05 05:33:30  IST  )

సౌత్ కొరియాలో స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్(CSAT) అత్యంత కీలకమైన ఎగ్జామ్. దీన్ని సాధారణంగా సునెంగ్ అని కూడా పిలుస్తారు. ఈ అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష అక్కడి విద్యార్థుల జీవితాలకు కీలక మలుపు..

90 సెకన్ల ముందే పేపర్ లాక్కున్నారు.. ప్రభుత్వంపై దావా వేసిన విద్యార్థులు..
X

దిశ, ఫీచర్స్ : సౌత్ కొరియాలో స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్(CSAT) అత్యంత కీలకమైన ఎగ్జామ్. దీన్ని సాధారణంగా సునెంగ్ అని కూడా పిలుస్తారు. ఈ అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష అక్కడి విద్యార్థుల జీవితాలకు కీలక మలుపు.. యూనివర్సిటీ అడ్మిషన్స్, జాబ్ ఆపర్చునిటీస్, పర్సనల్ రిలేషన్‌షిప్స్ అన్నీ దీనిపైనే ఆధారపడుతాయి. అయితే 2023 నవంబర్ 16న దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఈ టెస్ట్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. క్యుంగ్‌డాంగ్ హైస్కూల్‌లో జరిగిన పరీక్షలో.. కొరియన్ భాషా విభాగం సమయంలో ఎగ్జామ్ సూపర్‌వైజర్ బెల్‌ను 90 సెకన్లు ముందుగానే మోగించాడు. దీంతో విద్యార్థుల ఆన్సర్ షీట్‌లు సేకరించబడ్డాయి. ఈ తప్పిదం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన 39 మంది విద్యార్థులు.. తదుపరి పరీక్షా విభాగాలపై ఫోకస్ చేయలేకపోయామని, పరీక్షను పూర్తి చేయకుండానే వెళ్లిపోయామని పేర్కొంటూ ప్రభుత్వంపై దావా వేశారు.

ఒక్కొక్కరు సుమారు రూ.13లక్షలు పరిహారం కోరారు. ఇది పరీక్ష మళ్లీ రాసేందుకు.. ఒక సంవత్సరం ప్రిపేరింగ్‌కు అయ్యే ఖర్చుతో సమానం. ఈ సంఘటన సునెంగ్ పరీక్ష కీలక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. కాగా తప్పును గుర్తించిన అధికారులు.. లంచ్ బ్రేక్ సమయంలో విద్యార్థులకు 90 సెకన్ల అదనపు సమయం ఇచ్చారు. కానీ వారు కేవలం ఖాళీ స్థలాలను మాత్రమే రాయడానికి అనుమతించబడ్డారు. ఇప్పటికే రాసిన సమాధానాలను సవరించడానికి అవకాశం లేకపోయింది. ఈ సంఘటన విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. వారి న్యాయవాది కిమ్ వూ-సుక్ ప్రకారం.. విద్యా అధికారులు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు.

ఈ ఘటన 2021లో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్‌ను గుర్తు చేస్తుంది. బెల్ రెండు నిమిషాల ముందు మోగినందుకు విద్యార్థులకు సుమారు రూ. 4, 23,000 పరిహారం చెల్లించబడింది. సునెంగ్ పరీక్ష సమయంలో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిపివేయడం, స్టాక్ మార్కెట్ ఆలస్యంగా ప్రారంభించడం వంటి చర్యలు తీసుకోబడతాయంటే.. పరీక్ష తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2023 డిసెంబర్ 19న దాఖలైన ఈ దావా.. ఈ చిన్న తప్పిదం విద్యార్థుల జీవితంపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో గుర్తు చేస్తుంది.

Read More..

NEET Exam... కన్నీళ్లతో అధికారుల కాళ్ళ మీద పడిన తల్లి.. కారణం ఇదే


Next Story