అమ్మ పాడితే.. కడుపులో ఉన్న బిడ్డ వింటుంది..! శిశువు మెదడు ఎదుగుదలకు దోహదం చేస్తున్న అమ్మ పాట..

by Javid Pasha |

అమ్మ పాడితే.. కడుపులో ఉన్న బిడ్డ వింటుంది..! శిశువు మెదడు ఎదుగుదలకు దోహదం చేస్తున్న అమ్మ పాట..

అమ్మ పాడితే.. కడుపులో ఉన్న బిడ్డ వింటుంది..! శిశువు  మెదడు ఎదుగుదలకు దోహదం చేస్తున్న అమ్మ పాట..
X

దిశ, ఫీచర్స్ : అమ్మ పాట కళ్లుముందున్న పిల్లలకే కాదు, గర్భంలో ఉన్న శిశువులను సైతం ప్రభావితం చేస్తుందన్న విషయం మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ సమయంలో సరదాగా, సంతోషంగా పాడుకునే పాటలు ఆ స్త్రీకి పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శిశువు భావోద్వేగ, నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదం చేస్తాయి. 2013లో ‘Journal of Maternal-Fetal & Neonatal Medicine’లో, అలాగే 2017లో Frontiers in Psychologyలో పబ్లిషైన అధ్యయనాలు సైతం ఈ ఇదే పేర్కొన్నాయి.

*శిశువులు ధ్వనులను గ్రహించడం : స్త్రీ గర్భం ధరించిన 18 వారాల నుంచి, అంటే దాదాపు 4 నెలల ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులోని శిశువు ధ్వనులను వినగలుగుతుంది. మూడవ త్రైమాసికంలో, తల్లి స్వరాన్ని సైతం గుర్తించడం ప్రారంభిస్తుంది. అలాగే కడుపులో ఉన్న బిడ్డ మ్యూజిక్ అండ్ రిథమ్‌కు స్పందిస్తుంది. దీంతో తల్లి పాడే పాటలు శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

*తల్లి శరీరంలో హార్మోన్ల ప్రభావం : గర్భిణి స్త్రీ పాడినప్పుడు ఆక్సిటోసిన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మాయ (Placenta) ద్వారా శిశువుకు చేరి, కడుపులో ఉన్నప్పుడే ప్రశాంతతను, భద్రతా భావాన్ని(peace and security sense) పెంపొందిస్తాయి. ఇది శిశువు భావోద్వేగ స్థిరత్వాన్ని(Emotional stability) మెరుగుపరుస్తుంది.

* ఒత్తిడి దూరం : గర్భంలో ఉన్నప్పుడు తల్లిపాడే పాటలు లేదా మ్యూజిక్‌కు గురైన శిశువుల్లో ఒత్తిడి సంకేతాలు తగ్గుతాయి. స్థిరమైన హృదయ స్పందన రేటు(Stable heart rate)ను కలిగి ఉంటారు. ఇది వారి భావోద్వేగ నియంత్రణ సామర్థ్యా(Ability to regulate emotions)న్ని మెరుగుపరుస్తుంది. సంగీతం శిశువు నాడీ వ్యవస్థపై పీస్‌ఫుల్ ప్రభావం చూపుతుంది.

*జననం తర్వాత ప్రయోజనాలు : గర్భంలో విన్న పాటలు జననం తర్వాత కూడా శిశువులో ప్రశాంతత భావానికి కారణం అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లి స్వరం నుంచి వెలువడే శ్రావ్యమైన మెలోడీస్ తల్లి-శిశువు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఇది శిశువులో జ్ఞానం, భావోద్వేగాల(Cognitive and emotional) అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా సంగీతం శిశువుల భాషా నైపుణ్యాలను, సామాజిక పరస్పర చర్యలను కూడా మెరుగుపరుస్తుంది. మొత్తంగా, గర్భిణులు పాడడం వల్ల శిశువు శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది తల్లి-శిశువుల మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని సృష్టిస్తుంది. శిశువు జీవితంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. Link

Next Story