- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొలువు ఇవ్వడానికే పనికిరాడన్న బసవరాజ్ కోటి రూపాయల బిజినెస్ చేస్తున్నాడు
ఉద్యోగం పోయిన ప్రతీసారి ఇంట్లోవాళ్లు తిట్టేవాళ్లు

దిశ, ఫీచర్స్: బసవరాజ్.. క్రియేటివ్ పర్సనే. కానీ.. ఆయనకు కాలం కలిసి రాక వచ్చిన ఉద్యోగమల్లా ఫటాఫటా ఊడిపోయింది. ఉద్యోగం పోయిన ప్రతీసారి ఇంట్లోవాళ్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాళ్లు. "నువ్వేం మనిషివి.. ఎవరిదీ పోనిది నీ ఒక్కడి ఉద్యోగమే ఎందుకు పోతుంది" చివాట్లు పెట్టేవాళ్లు.
తన్ని తరిమేశారు
ఎప్పట్లాగే బసవరాజ్ ఉద్యోగం ఊస్టింగ్ అయింది. వాళ్ల నాన్నకు ఎక్కడలేని కోపం వచ్చింది. తన్ని తరిమేస్తే పీడా పోతుంది అనుకున్నాడు. మరీ ఉత్త చేతులతో పంపిస్తే ఆకలికి చస్తాడనుకున్నాడో ఏమో చేతిలో రూ.1000 పెట్టాడు. "మల్ల ఇటు మొకాన రాకు" అని రెండు జతల బట్టలను మొఖమ్మీద కొట్టాడు. బసవరాజ్ ఏడుపు ఆపుకోలేదు. "మల్లెప్పుడూ రాను" అనుకుంటూ బయటకు వెళ్లాడు. ముందే ఉద్యోగాలు అచ్చిరావడం లేదు కాబట్టీ ఎక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. ఏదైనా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చింది. కానీ.. ఎలా చేతిలో పైసా లేదు. వాళ్ల నాన్నిచ్చిన రూ.1000తో బెంగళూరు పయనమయ్యాడు.
రోజుకు 25 కంపెనీలు
ఆత్మగౌరవంతో బెంగళూరులో దిగిన బసవరాజ్ రెండు వాగ్దానాలు చేసుకున్నాడు. ఒకటి.. ఏదీ సాధించకుండా మళ్లీ ఊరికి పోవద్దు. రెండు.. ఆ లక్ష్యాన్ని పదేళ్లలోనే సాధించాలి. లక్ష్య సాధనలో భాగంగా బెంగళూరు మొత్తం వ్యాపార వేటలో తిరిగాడు. కానీ ఎక్కడా వర్కవుట్ కాలేదు. కమ్యూనికేషన్ లేకుండా.. క్యాపిటల్ అమౌంట్ లేకుండా.. ఒక ప్లాన్ లేకుండా తన ప్రారంభ ప్రయాణం సాగింది. ఎదురొచ్చిన తలుపునల్లా తట్టాడు.. తన దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అవకాశం ఇవ్వండని. రోజుకు 20 నుంచి 25 కంపెనీలు తిరిగేవాడు. వాళ్లతో నేరుగా మీటింగ్ అయ్యి తన ఐడియా గురించి వివరించేవాడు. ఆ కృషి ఫలితంగా "సేల్స్"లో మంచి గుర్తింపు పొందాడు. కానీ అతడి లక్ష్యం అంతకంటే గొప్పగా ఉంది కదా.?
రాఫ్టర్ స్టార్టప్
సొంతంగానే రంగంలోకి దిగాలని రూ. 55,000 పెట్టుబడితో "కంబర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్"ను స్థాపించాడు. పర్యావరణానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో ఇది ప్రారంభమైంది. వెదురు బొంగుల బాటిల్స్ నుంచి తవుడు మగ్‌ల వరకు సుస్థిరమైన ఉత్పత్తులను అందిస్తోంది. విలువలతో కూడిన వ్యాపారంలో ఉండే కిక్కు వేరే ఉంటుందని నమ్ముతాడు బసవరాజు. యూనిఫాంస్, భద్రతా సామగ్రి, ఆఫీస్ మెటీరియల్ వంటివి సరఫరా చేస్తున్నారు. కొవిడ్ తర్వాత సుస్థిర జీవనం గురించి అతడికి అవగాహన పెరిగింది. "నా వ్యాపారం ద్వారా నేను సమాజానికి ఏ విధంగా సహకరించగలను" అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చింది "రాఫ్టర్ స్టార్టప్". కార్పొరేట్ గిఫ్టింగ్ ను పర్యావరణహతంగా మార్చడమే దీని లక్ష్యం.
రూ. 1 కోటి ఆదాయం
సాధారణంగా కొత్త ఉద్యోగులకు బాటిల్.. పెన్.. నోట్‌బుక్.. మగ్ ఇస్తారు. వీటిని సుస్థిర ఎంపికలతో ఎలా భర్తీ చేయవచ్చు అన ప్రశ్న నుంచి రాఫ్టర్ ఆవిష్కరణలు పుట్టాయి. 2022లో స్థాపించిన "రాఫ్టర్" బాంబో బాటిల్స్.. రీసైకిల్ పేపర్‌తో చేసిన నోట్‌బుక్స్.. తవుడుతో చేసిన మగ్స్ అందిస్తోంది. ఇవి పెద్ద ఫ్యాక్టరీలలో ఉత్పత్తి కావు. మైసూర్.. ఢిల్లీ.. గురుగ్రామ్.. బెంగళూర్ వంటి నగరాల్లో చిన్న సుస్థిర ఉత్పత్తిదారులతో బసవరాజ్ భాగస్వామ్యం చేస్తాడు. తవుడుటో చేసిన మగ్‌ను 5 వేల సార్లు తోమినా ఏమీ కాదు. రాఫ్టర్ ఇప్పటివరకు 5000 వెల్కమ్ కిట్స్.. బాటిల్స్.. మగ్స్.. నోట్‌బుక్స్ ఇన్పోసిస్.. అప్లయిడ్ మెటీరియల్స్.. లోవ్స్.. టీఈఎస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలతో కలిసి రూ. 1 కోటి ఆదాయాన్ని సాధించింది.






