పాత జీన్స్‌తో పర్యావరణ హిత ఇన్సులేషన్.. రీసైక్లింగ్‌తో సస్టైనబుల్ భవిష్యత్తు..!

by Javid Pasha |

డెనిమ్‌లోని కాటన్ ఫైబర్స్ సహజ ఇన్సులేటర్‌లుగా పనిచేస్తాయి. ఫైబర్‌గ్లాస్‌తో సమానంగా వేడిని నిలుపుకుంటాయి.

పాత జీన్స్‌తో పర్యావరణ హిత ఇన్సులేషన్.. రీసైక్లింగ్‌తో  సస్టైనబుల్ భవిష్యత్తు..!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక ఫ్యాషన్ దుస్తుల్లో జీన్స్‌కు ఉన్న క్రేజే వేరు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జీన్స్ ప్యాంట్లు, షర్టులు ధరిస్తుంటారు. ఎక్కువకాలం మన్నిక, ట్రెండీ లుక్ వంటివి యువతలో వీటిపట్ల ఆకర్షణకు కారణం అవుతుంటాయి. అయితే వీటిని ఉపయోగించాక ఇక ఎందుకు పనికిరావని పడేస్తుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ పాతబడిన జీన్స్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతకు సహాయపడుతున్నాయి అమెరికా, యూరప్‌ దేశాల్లోని కొన్ని కంపెనీలు.

డెనిమ్ జీన్స్‌ను ష్రెడ్ చేసి..

ముఖ్యంగా ఉపయోగించలేని పాత జీన్స్‌ను ఇండ్లల్లో ఇన్సులేట్ చేయడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇన్సులేషన్ అంటే ఇక్క ఒక భవనంలో వేది, చల్లదనం లేదా శబ్దాన్ని నియంత్రించడానికి ఉపయోగించే పద్ధతి. ఇది ఇంటిలోపలి ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీన్స్‌ను అందుకోసం ఉపయోగిస్తున్నాయి కొన్ని కంపెనీలు. ప్రజలు యూజ్ చేసి పడేసిన డెనిమ్ జీన్స్‌ను ష్రెడ్ చేసి, వాటిని ఇండ్లకు సస్టైనబుల్ ఇన్సులేషన్‌గా మార్చేస్తున్నాయి.

సురక్షితం.. పర్యావరణ హితం

డెనిమ్‌లోని కాటన్ ఫైబర్స్ సహజ ఇన్సులేటర్‌లుగా పనిచేస్తాయి. ఫైబర్‌గ్లాస్‌తో సమానంగా వేడిని నిలుపుకుంటాయి. పైగా టాక్సిక్ కెమికల్స్ లేదా స్కిన్ ఇరిటేషన్ లేకుండా ఈ ప్రక్రియ సురక్షితమైన, సౌకర్యవంతమైన ఇన్సులేషన్‌ను అందిస్తుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ ఎంపికగా(environmentally friendly option) గుర్తింపు పొందుతోంది. ఇలా చేయడంవల్ల టెక్స్‌టైల్ వ్యర్థాలు తగ్గుతాయి. అంతేకాకుండా సాంప్రదాయ ఇన్సులేషన్ మెటీరియల్ ఉత్పత్తిలో విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. ఎందుకంటే డెనిమ్ రీసైక్లింగ్ తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. కాబట్టి అనేకమంది ఇంటి యజమానాలు దీనిని సేఫ్టీ, కంఫర్ట్, సస్టైనబిలిటీ కారణంగా ఎంచుకుంటున్నారు. ఈ విధానం ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తూ , రీసైక్లింగ్ అండ్ సస్టైనబుల్ జీవనశైలిని ప్రోత్సహిస్తోంది. Link

Next Story