"సోయిలేని ఉయ్యాలాట"... ఎస్కలేటర్ పై.. బాలుడితో మహిళల 'రీల్స్' వీడియో వైరల్

by Geesa Chandu |   (  Updated:2024-08-04 14:28:09  IST  )

ఈ మధ్య జనాలు వారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వారికే అస్సలు తెలియట్లేదు. వారు ఉన్న ప్రదేశాలను కూడా మర్చిపోతూ.. సోషల్ మీడియా ఫోబియాలో పడి, డెయిలీ రీల్స్ అనే మైకంలో మునిగి తేలుతున్నారు.

సోయిలేని ఉయ్యాలాట... ఎస్కలేటర్ పై.. బాలుడితో మహిళల రీల్స్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య జనాలు వారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వారికే అస్సలు తెలియట్లేదు. వారు ఉన్న ప్రదేశాలను కూడా మర్చిపోతూ.. సోషల్ మీడియా ఫోబియాలో పడి, డెయిలీ రీల్స్ అనే మైకంలో మునిగి తేలుతున్నారు. నేడు మారుతున్న అభివృద్ది ప్రపంచంలో ప్రజల అవసరాలు, జీవన శైలికి తగ్గట్టు బస్ స్టాప్ లు, రైల్వే స్టేషన్ లు, షాపింగ్ మాల్స్ మొదలైన ప్రదేశాలు ఆధునిక సాంకేతికతను జోడించుకొని రూపుదిద్దుకుంటున్నాయి. అందులో భాగమే ఈ ప్లాట్ ఫాం క్రాసింగ్ ఎస్కలేటర్ లు!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఎస్కలేటర్ లు ఉంటున్నాయి. ప్రయాణికులకు లేదా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీటిని అమర్చుతారు, అయితే ఎస్కలేటర్‌లపై ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో కొన్నిసార్లు కొంతమంది తప్పులు చేస్తారు. వీటిని ఎలా ఉపయోగించాలో తెలియక జనాలు గాయపడిన సంఘటలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇటువంటి సంఘటనే జరిగినట్లు తెలుస్తోంది.

ఎక్కువగా వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఓ చిన్నారితో కలిసి ఎస్కలేటర్ ఎక్కుతూ రీల్స్ చేస్తున్నారు. ఈ సమయంలో చిన్నారి బాలుడితో ఒక ఆట ఆడుతున్నారు. ఇద్దరు మహిళలు ఓ చిన్నారి బాలుడి చేతులు పట్టుకుని స్టేషన్‌లోని ఎస్కలేటర్‌ ఎక్కుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో ఇద్దరు స్త్రీలు బాలుడి చేతులు పట్టుకుని గాలిలో ఊపుతూ ఒకొక్క మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, బాలుడి చేయి పట్టుకున్న ఒక మహిళ మెట్లపై అకస్మాత్తుగా కిందపడి కూర్చుండిపోయింది. అంతేకాదు ఆ మెట్టు మీద నుండి తన పట్టును కోల్పోవడం ప్రారంభించింది. ఆమె పడిపోతూ తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించినా.. పట్టు సడలడం తో వారంతా ఎస్కలేటర్ మెట్లపై పడి దొర్లారు. దీంతో వారు ఖంగారుకు లోనయ్యారు, వారితో ఉన్న బాలుడి పాదాలకు స్వల్ప గాయాలైనట్లు సంఘటనను చూస్తే అర్ధమవుతుంది.

కాబట్టి ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా.. జనాలు బయటకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలను వెంట తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్తతో ఉంటేనే మంచిది. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి జరభద్రం. !

Next Story