- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియల్ కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తున్న ‘రీల్స్ వ్యసనం’.. ఆధునిక యువతలో అనుబంధాలకు బీటలు..!
రియల్ కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తున్న ‘రీల్స్ వ్యసనం’.. ఆధునిక యువతలో అనుబంధాలకు బీటలు..!

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు ఏర్పడింది. అయితే కమ్యూనికేషన్ పరంగా ఇలాంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, వినియోగించుకునే తీరును బట్టి దానికి అడిక్ట్ కావడమనేది యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రీల్స్ స్క్రోల్ చేయడం, క్రియేట్ చేయడం క్రమంగా వ్యసనంగా మారి మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
సమాచారం తెలుసుకోవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. పైగా దానికి కేటాయించే సమయం కూడా ముఖ్యమైనది. ఇది ఒక పరిమితిలో ఉంటే పర్లేదు కానీ కొందరు పరిమితికి మించి, పరిధి దాటి, సరిహద్దులు అధిగమించి సోషల్ మీడియాను స్వార్థానికో, వ్యవసనానికో ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన సాంకేతిక, మానసిక నిపుణులు సైతం గుర్తించారు.
ఒకప్పుడు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవారు. సంతోషంగా గడిపేవారు. ఈ విధమైన కమ్యూనికేషన్ వల్ల పరస్పర అవగాహ కూడా ఏర్పడేది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసేది. తమ పిల్లల/టీనేజర్ల మనస్తత్వం ఎలాంటిదో, వారిని ఎలా డీల్ చేయాలో పేరెంట్స్‌కు, ఫ్యామిలీలోని ఇతర సభ్యులకు ఈజీగా అర్థమయ్యేది. అట్లనే యువత కూడా ఆయా పరిస్థితుల్లో తమ పేరెంట్స్‌ను, కుటుంబంలోని ఇతరులను అర్థం చేసుకోవడంలో ఇలాంటి ఓపెన్ కమ్యూనికేషన్ ఎంతగానో దోహద పడేది. ఇది మనుషుల మధ్య ప్రేమానురాగాలను చిగురింపజేసేది. అనుబంధాలను బలోపేతం చేసేది. కానీ రాను రాను ఈ పరిస్థితిలో కొంత ప్రతికూల మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వయసుతో సంబంధం లేకుండా కొందరు పలు సోష్ మీడియా వేదికలకు అడిక్ట్ అవుతున్నారు. సెల్ఫీలు, రీల్స్, వెరైటీ స్టంట్ల మోజులో పడి మంచితనం, మానవత్వం, నైతిక విలువలు సైతం మర్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో మాట్లాడటం వంటివి చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఏమాత్రం టైమ్ దొరికినా ‘రీల్స్ చేయడంలో లేదా క్రియేట్ చేయడంలో బిజీగా ఉండిపోతూ.. రియల్ కమ్యూనికేషన్‌ను విస్మరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఛాటింగ్‌లపై చూపే ఆసక్తి, రియల్ కమ్యూనికేషన్‌పై చూపడం లేదు. ఈ పరిస్థితులు మనుషుల మధ్య పరస్పర చర్యలకు కలిగే అంతరాయం కలిగిస్తున్నాయి. దీనినే ‘టెక్నోఫెరెన్స్’ గా కూడా నిపుణులు పిలుస్తున్నారు. ఇది మానవ సంబంధాలను దెబ్బతీస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.






