- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది కథ కాదు.. సోషల్ మీడియా విష కౌగిలిపై చేదు గుళిక!
వెర్రి వేయి రకాలంటే ఏమో అనుకున్నం గానీ.. ప్రజెంట్ జనరేషన్ మెంటల్ స్టేటస్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. సిల్లీ రీజన్స్‌కే ప్రాణం తీసుకునే డెలికేటెడ్ మైండ్స్ అని అర్థమవుతోంది. లా డిగ్రీ చదివి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన మిషా అగర్వాల్..

దిశ, ఫీచర్స్ : వెర్రి వేయి రకాలంటే ఏమో అనుకున్నం గానీ.. ప్రజెంట్ జనరేషన్ మెంటల్ స్టేటస్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. సిల్లీ రీజన్స్‌కే ప్రాణం తీసుకునే డెలికేటెడ్ మైండ్స్ అని అర్థమవుతోంది. లా డిగ్రీ చదివి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన మిషా అగర్వాల్.. లైక్స్, షేర్స్‌లోనే జీవితాన్ని వెతుక్కుంది. ఫాలోవర్ల సంఖ్యను చూసే ఆనందపడింది. ప్రస్తుతం ఆ ఫాలోవర్ల సంఖ్య తగ్గిందనే ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకుంది. ఇది ఈ తరం పిల్లల మానసిక స్థితికి అద్దంపట్టే సంఘటన. ఇతరులకు నచ్చేలా ఉండాలనే వెర్రిలో.. తమ కోసం తాము బతకడాన్ని మర్చిపోతున్న కొత్త తరం కథ. మరి ఈ తరహా మనస్తత్వాలు, వారిపై సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రముఖ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం..
యువతను సోషల్ మీడియా మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తోంది?
సోషల్ మీడియా మెంటల్ గ్రిప్‌కు.. ఇతరులు తమను చూడాలని, తమ ఇష్టాలను యాక్సెప్ట్ చేయాలనే ప్రాథమిక విషయాలే గుండెకాయ లాంటివి. కానీ ఈ ధోరణి అనేది డిజిటల్ ప్రపంచంలో అధ్వాన్నంగా రూపొందించబడింది. మొదటి నుంచి పేరెంట్స్..ప్రతీ చిన్న విషయాన్ని గ్రేడ్స్‌లో కాకుండా తమ పిల్లల స్పెషల్ ఎబిలిటీస్‌ను గుర్తించి మెచ్చుకుని ఉంటే బాగుండేది. ఇది వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను డెవలప్ చేసేది. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయత్నించే ప్రాసెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. అలా అయితే తమ విలువ ఇతరుల ప్రశంసలతో కాకుండా చేసే పనివల్ల పెరుగుతుందని అర్థం చేసుకుంటారు. ఆనందం, ప్రశంసలు.. బయట నుంచి రావాలనే దృక్పథాన్ని తల్లిదండ్రులే మార్చాలి.
ఆత్మహత్యకు దారితీసే కారణాలు..
సోషల్ మీడియా పోస్టులకు వచ్చే ప్రతి‘లైక్ లేదా కొత్త ఫాలోవర్’.. మెదడుకు ఆనందాన్నిచ్చే డోపమైన్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇది క్రమేపీ వ్యససంలా మారుతుంది. సోషల్ మీడియా అల్గారిథమిక్ నేచర్ ప్రకారం.. బా గా పెర్ఫామ్ చేసే పోస్టులకే ఎక్కువ ప్రచారం లభిస్తుంది. మిగతావి కనిపించకుండా పోతయి. ఈ తరహా సిస్టమ్.. వారి ప్రతి అప్‌లోడ్‌ను మానసిక జూదంగా మారుస్తాయి. ప్రారంభంలో ఉన్న సృజనాత్మకపు వ్యక్తీకరణ.. క్రమంగా బలవంతపు స్వీయ పర్యవేక్షణగా మారుతుంది. ఇదే క్రమంలోతమ కంటెంట్ పెర్ఫామెన్స్ బాగాలేనపుడు లేదా ఫాలోవర్స్ సంఖ్య తగ్గిపోయినపుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ విషయాలను పర్సనల్‌గా తీసుకుని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఇక్కడి నుంచే ఆత్మహత్య ఆలోచనలు పుట్టుకొస్తయి. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేరు. వారి ముఖం, స్వరం, లైఫ్ స్టైల్, బాధ, సంతోషం.. అన్నీ కంటెంటే అనేంతగా మారిపోతారు. అందుకని ఫాలోవర్లు తమను చూడటం మానేసినపుడు.. తమ అస్థిత్వానికి అర్థమేంటనే ఆలోచనలతో ఆత్మహత్యకు పాల్పడతారు.
వ్యసనం నుండి బయటపడటం ఎలా?
చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ .. మీలో మీకు నచ్చేది ఏంటనే సాధారణ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే వారికి రియల్ లైఫ్ ఎమోషన్స్ ఉండవు. అందుకే కేవలం ఒక మనిషిగా వారి విలువను పెంచే వాతావరణాన్ని కల్పించి, రిలేషన్‌షిప్స్‌ను రీబిల్డ్ చేసుకోవడంపై దృష్టి సారించాలి. సోషల్ మీడియాకు సెలవు తీసుకోవడం కుదరకుంటే తరచూ లైక్స్‌ను చూసుకోకుండా నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేసుకోవాలి. లేదంటే ఫాలోవర్ల సంఖ్యను పెద్దగా పట్టించుకోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తే ఇంకా మంచిది.






