చో క్యూట్.. ఈ బుడ్డదానికి పర్ఫార్మెన్స్‌కు ఆస్కార్ అవార్డు ఇచ్చేయండి సార్..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-04-26 06:57:17  IST  )

సోషల్ మీడియాలో పిల్లల వీడియోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొంచెం యూనిక్‌గా అనిపించినా.. వాళ్లు చేసే పనులు క్యూట్‌గా ఉన్నా.. ఈజీగా లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చేస్తాయి. లైక్‌లు పడుతనే ఉంటాయి. షేర్స్‌కు కొదువే ఉండదు. అలాంటి

చో క్యూట్.. ఈ బుడ్డదానికి పర్ఫార్మెన్స్‌కు  ఆస్కార్ అవార్డు ఇచ్చేయండి సార్..(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో పిల్లల వీడియోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొంచెం యూనిక్‌గా అనిపించినా.. వాళ్లు చేసే పనులు క్యూట్‌గా ఉన్నా.. ఈజీగా లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చేస్తాయి. లైక్‌లు పడుతనే ఉంటాయి. షేర్స్‌కు కొదువే ఉండదు. అలాంటి వీడియోనే ఈ బుడ్డదాని క్యూటెస్ట్ పర్ఫార్మెన్స్. అప్పుడప్పుడే నడక నేర్చుకున్న ఈ పొట్టిది.. వాకర్ మీద స్పీడ్‌గా వెళ్తుంది. ముందుగా ఉన్న వ్యక్తిని ఢీకొడుతుంది. దీంతో ఆ వ్యక్తికి దెబ్బలు తగిలాయనుకుని.. తనను ఏమైనా అంటారేమోనని, తను కూడా ఈ యాక్సిడెంట్‌లో గాయాలతో పడిపోయినట్లు యాక్ట్ చేస్తుంది.

ఇక ఈ పర్ఫార్మెన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. బుడ్డదానికి వెంటనే ఆస్కార్ ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్‌ఫ్యాక్ట్ ఇదే క్యాప్షన్‌తో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీన్ని చూసి పడిపడి నవ్వుకుంటున్న ఇంకొందరు.. ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలని కోరుతున్నారు. చో స్వీట్ అంటూ లవ్ లీ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియోతో ఈ రోజు బెస్ట్‌గా స్టార్ట్ అయిందని కొందరంటే.. ఇంటర్నెట్‌లో చూసిన బెస్ట్ వీడియో ఇదేనని మరికొందరు అంటున్నారు.

Click For Tweet..

Next Story