టోటల్లీ డిజిటల్ లైఫ్.. 2035 నాటికి మానవ జీవితంలో జరిగే 90% మార్పులివే..!

by Javid Pasha |

ఇన్విజబుల్ సెన్సార్స్(Invisible Sensors) నుంచి గ్రాఫీన్ బ్యాటరీల వరకు2035లో స్మార్ట్‌ఫోన్లు లెన్స్‌లు అవసరం లేని ఇన్విజబుల్ సెన్సార్‌లతో ఉండే అవకాశం ఉంది. ఇవి లైట్ వేవ్‌లెంగ్త్‌లను మానిప్యులేట్ చేసి ఇమేజ్‌లను జెనరేట్ చేస్తాయి.

టోటల్లీ డిజిటల్ లైఫ్.. 2035 నాటికి మానవ జీవితంలో జరిగే 90% మార్పులివే..!
X

దిశ, ఫీచర్స్ : సాంకేతికత మానవ జీవితాన్ని అనేక మలుపులు తిప్పుతోంది. వివిధన పనుల్లో మానవ శ్రమను సులభతరం చేస్తోంది. ఇప్పటికే హోటోగ్రాఫిక్, ఏఐ ఆధారిత వెరబుల్ డివైజ్‌లు జీవితంలో అనివార్యమైపోతున్నాయి. గ్లాస్ రెక్టాంగిల్ ఆకారంలో కెమెరా, స్క్రీన్, బ్యాటరీతో కూడిన ‘కెమెరా స్లాబ్స్’గా అవి మారాయి. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ అవసరాలను బ్యాలెన్స్ చేస్తున్నాయి. అయితే 2035 నాటికి ఈ డివైజ్‌లు పూర్తిగా మారవచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు. హోలోగ్రాఫిక్ డిస్‌ప్లేలు. ఏఐ(AI) పవర్డ్ ఇంటెలిజెన్స్, క్లౌడ్-లింక్డ్ వేరబుల్స్‌(Cloud-linked wearables)గా మారవచ్చు. ఇవి మన శరీర అవసరాల చుట్టూ రూపొందిన ఫ్లెక్సిబుల్, ఇంటెలిజెంట్ డివైజ్‌లుగా మారి, ప్రస్తుతమున్న డిజైన్లను పూర్తిగా మార్చేసేయవచ్చు. ఉదాహరణకు, రోలబుల్ స్క్రీన్‌లు, ఆన్-డివైస్ AI, హోలోగ్రాఫిక్ డిస్‌ప్లేలు, సెల్ఫ్-హీలింగ్ బాడీలు(Self-healing bodies), సాలిడ్-స్టేట్ బ్యాటరీలు (Solid-state batteries) వంటి సాంకేతికత 2030 నాటికే దాదాపు అందుబాటులోకి రావచ్చు. రీసెంట్ స్టడీస్ ప్రకారం.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లలో రోజువారీ ఉపయోగానికి మరెంతో దూరంలో లేదు. దీని వల్ల 3D ఇమేజ్‌లు లైట్ మానిప్యులేషన్ ద్వారా క్రియేట్ చేయబడతాయి. ఈ మార్పు మన జీవనశైలిని పూర్తిగా మలుపు తిప్పి, టెక్నాలజీని మానవ శరీరంలో ఒక భాగంగా లేదా ఒక సమ్మేళనంగా మార్చేయవచ్చు(Blends with our body,) అంటున్నారు నిపుణులు. ఫ్రిక్షన్ లేకుండానే అనేక విషయాల్లో మన ఆలోచనలు, అలవాట్లు, ప్రయాణాలు, కమ్యూనికేషన్‌లను మారుస్తుంది.

కీ ఫీచర్స్.. గాలిలో టైప్ చేయడం

ఇన్విజబుల్ సెన్సార్స్(Invisible Sensors) నుంచి గ్రాఫీన్ బ్యాటరీల వరకు2035లో స్మార్ట్‌ఫోన్లు లెన్స్‌లు అవసరం లేని ఇన్విజబుల్ సెన్సార్‌లతో ఉండే అవకాశం ఉంది. ఇవి లైట్ వేవ్‌లెంగ్త్‌లను మానిప్యులేట్ చేసి ఇమేజ్‌లను జెనరేట్ చేస్తాయి. ఉదాహరణకు.. మెటామెటీరియల్స్ ఆధారిత హోలోగ్రాఫిక్ డిస్‌ప్లేలు, మన చుట్టూ 3D ప్రొజెక్షన్‌లను సృష్టించి, ఫిజికల్ కీబోర్డ్‌లకు బదులు హోలోగ్రామ్ కీబోర్డ్‌లను అందిస్తాయి. టచ్ టైపింగ్‌కు బదులు ఎయిర్ టైపింగ్ ద్వారా పని చేస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌లు పూర్తిగా కన్వర్జేషనల్ AIగా మారి, మన మాటలను, సంజ్ఞలను మరింత లోతుగా అర్థం చేసుకుని స్పందిస్తాయి. ఉదాహరణకు OpenAI లాంటి మోడల్స్ ఆధారంగా ఫోన్లు మన వాయిస్‌లోనే రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ చేస్తాయి. లాంగ్వేజ్ ఏదైనా మన స్వరంతో మాట్లాడుతాయి.

సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ

ప్రస్తుతం ఫోన్, ట్యాబ్ వంటి వాటి డిస్‌ప్లేలు పాడవడం వంటివి జరిగింతే వాటిని మార్చడానికి రిపేరింగ్ సెంటర్లకు, సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తుంది. కానీ 2025 తర్వాత ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పాడైన డిస్‌ప్లేలు, క్రాక్డ్ స్క్రీన్‌లు సెల్ఫ్-హీల్ అవుతాయి. నానో-మెటీరియల్స్ ద్వారా క్రాక్‌లను ఆటోమేటిక్‌గా మరమ్మతు చేస్తాయి. పర్సనల్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్-బేస్డ్ క్లౌడ్‌కు మారి, డేటా లాస్ అవకుండానే మన ఐడెంటిటీ (బయోమెట్రిక్‌లు) ద్వారా యాక్సెస్ అవుతుంది. గ్లోబల్ కనెక్టివిటీ శాటిలైట్ కాలింగ్‌పై ఆధారపడి, 6G లేదా అంతకు మించిన నెట్‌వర్క్‌లతో రిమోట్ ఏరియాల్లో కూడా సిమ్ లెస్ కాల్స్, డేటా షేరింగ్ సాధ్యమవుతుంది. గ్రాఫీన్ బ్యాటరీలు 48 గంటలు లేదా అంతకు మించి రన్ అవుతాయి. డివైస్ ఫ్లెక్సిబుల్ మెటీరియల్స్ (గ్రాఫీన్, పాలిమర్‌లు)తో తయారై, వ్రిస్ట్ బ్యాండ్ లేదా నెక్‌లెస్‌గా బెండ్ అవుతూ వెరబుల్‌గా మారుతుంది. ఫోల్డబుల్ స్క్రీన్‌లు లార్జ్ డిస్‌ప్లేలను కాంపాక్ట్‌గా మారుస్తాయి. ఇటీవలి ఆవిష్కరణల ప్రకారం.. ట్రాన్స్‌పరెంట్ ఫోన్‌లు డిజిటల్ కంటెంట్‌ను రియల్ వరల్డ్‌తో బ్లెండ్ చేస్తాయి. హెల్త్ సెన్సార్స్ బ్లడ్ ప్రెజర్, హైడ్రేషన్ వంటివి వాటిని మానిటర్ చేస్తాయి.

జీవితంపై ప్రభావం

శరీర-టెక్ సమ్మేళనం (Body-Tech Compound) అందుబాటులోకి రావడంవల్ల ఫ్రిక్షన్‌లెస్ ఎక్స్‌పీరియన్స్.. అంటే టెక్నాలజీని ఉపయోగించడంలో ఎలాంటి అడ్డంకి, ఆలస్యం, కష్టం, అనసవర ఆలోచన లేకపోవడం, ఆలోచించగానే పని జరిగిపోవడం, మాట్లాడగానే అర్థమైపోవడం, ఏం చేయాలో ఫోన్ ముందే తెలుసుకుని చేసేయడం వంటివి. ఈ మార్పు జరిగితే గనుక మన రోజువారీ జీవితం పూర్తిగా మారుతుంది. ఉదాహరణకు, ప్రయాణాల్లో శాటిలైట్ కనెక్టివిటీ వల్ల రిమోట్ లొకేషన్‌లలో కూడా వీడియో కాల్స్, వర్చువల్ మీటింగ్‌లు సాధ్యం అవుతాయి. మన అలవాట్లు (హ్యాబిట్స్) AI ద్వారా ప్రెడిక్ట్ అయి, పర్సనలైజ్డ్ సజెషన్‌లు ఇస్తాయి. ఉదాహరణకు, మీ డైట్ ఆధారంగా హోలోగ్రాఫిక్ మెనూలు. కమ్యూనికేషన్‌లో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ వల్ల భాషలో అడ్డంకులు తొలగి, మన స్వరంతోనే మాట్లాడటం వల్ల సహజమైన సంభాషణలు జరుగుతాయి. ఆలోచనలు (థింకింగ్) AIతో ఇంటిగ్రేట్ అయి, మైండ్-కంట్రోల్ ఫీచర్స్ (Brain-Computer Interfaces) ద్వారా థాట్స్‌ను డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఉదాహరణకు Neuralink లాంటి టెక్‌లతో. శరీరంతో ఇంటిగ్రేషన్ వల్ల, వేరబుల్ డివైజ్‌లు మానవ చర్మంతో సమానంగా ఫిట్ అయి, హెల్త్ మానిటరింగ్, ఎమోషనల్ సపోర్ట్ (AI కౌన్సెలింగ్) అందిస్తాయి. ఇది మానవ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ ప్రైవసీ, అడిక్షన్ సమస్యలు కూడా తలెత్తవచ్చు. మొత్తంగా ఈ డివైజ్‌లు మానవ జీవితాన్ని ‘ఫ్రిక్షన్‌లెస్’గా మార్చి, జీవితం 90 శాతం టెక్నాలజీపై ఆధారపడేలా చేస్తాయి. Link

Next Story