- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sleep inertia : అలారం మోగగానే స్నూజ్ చేసి పడుకుంటున్నారా..? ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలివే..
ఒక పరిశోధన ప్రకారం అలారం స్నూజ్ చేయడం వల్ల నిద్రను విచ్ఛిన్నం (Fragmented sleep) చేసే ‘స్లీప్ ఇనర్షియా’ని పెంచుతుంది.

దిశ, ఫీచర్స్ : పొద్దున్న త్వరగా నిద్రలేవాలని అలారం సెట్ చేసి పడుకుంటారు కొందరు. సమయం కాగానే అది మోగుతూ ఉంటే.. వెంటనే మేల్కొంటారు. కానీ నిద్ర ముంచుకొస్తుండటంతో ఠక్కుమని స్నూజ్ బటన్ నొక్కేస్తారు. కాసేపయ్యాక లేద్దామని మళ్లీ పడుకుంటారు. కానీ తరచుగా ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? స్లీప్ మెడిసిన్ రివ్యూస్‌లో పబ్లిషైన ఒక పరిశోధన ప్రకారం ఇది తరచుగా నిద్రను విచ్ఛిన్నం (Fragmented sleep) చేసే “sleep inertia”ని పెంచుతుంది. అంటే తర్వాత నిద్రలేచినప్పటికీ మనసు గందర గోళంగా (Zombie-like state of minde) ఉంటుంది. ప్రశాంతంగా ఉండలేరు.
అలారం మోగినప్పుడే నిద్రలేవకుండా తాత్కాలికంగా ఆపివేస్తే.. ఆ తర్వాత లేచినప్పటికీ మీ రోజువారీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెదడు క్లారిటీని దెబ్బతీస్తుంది. ఎందుకంటే స్నూజ్ బటన్(Snooze button) నొక్కి తర్వాత మేల్కొనడం మీ నిద్రా చక్రానికి (sleep cycle) అంతరాయం కలిగిస్తుంది. దీంతో ఉదయం లేవగానే అలసట, గందరగోళం, నీరసం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఫస్ట్‌టైమ్ అలారం మోగగానే నిద్రలేస్తే మాత్రం ఇలాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడదు. పైగా మెదడు రాపిడ్ ఐ మూవ్‌మెంట్( REM ) అనేది నిద్ర లేదా లోతైన నిద్ర నుంచి సహజంగా బయపడి, మేల్కొన్న స్థితిలోకి మారుతుంది. ఇది స్పష్టమైన ఆలోచన, మెరుగైన ఏకాగ్రత, రోజంతా ఎనర్జీని అందిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా స్నూజ్ చేయడంవల్ల స్లీప్ సైకిల్ మధ్యలో ఆగిపోయి, బ్రెయిన్ పూర్తిగా మేల్కొనలేక, ఇన్‌కంప్లీట్ రివకరీ (incomplete recovery) స్థితిలో ఉంటుంది. ఫలితంగా రోజువారీ పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే అలారం మోగిన వెంటనే స్నూజ్ చేయకుండా ఫస్ట్ రింగింగ్‌కే(Alarm ringing) లేవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అలారం పెట్టుకోకుండా, స్నూజ్ చేయకుండా మేల్కొనే సహజమైన నిద్ర మేల్కొలుపు కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. Link






