- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతిరోజూ బోర్లా పడుకుంటే.. వెన్ను నొప్పి తప్పదు!

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండటంలో స్లీపింగ్ పొజిషన్ కూడా కీ రోల్ పోషిస్తుందన్న విషయం మీకు తెలుసా? ఎందుకంటే.. కొన్ని రకాల నిద్ర భంగిమలు సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎముకలు, కండరాలు, వెన్ను నొప్పికి కారణం అవుతుంది. అలాంటి బ్యాడ్ స్లీపింగ్ పొషిషన్‌లో ఒక వైపునకు వంకర తిరిగి బోర్లా పడుకోవడం (Sleeping like a log) కూడా ఒకటి. దానివల్ల కలిగే నష్టాలేమిటో ఇప్పుడు చూద్దాం
*పడుకునే అలవాట్లు కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు పొట్ట మంచానికి ఆనించేలా బోర్లా పడుకొని, ఒక కాలును వంచి, ముఖం కింది భాగంవైపు ఉంచిన భంగిమలో పడుకుంటే కండరాలు, ఎముకలు, వెన్నెముక, మెడ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ పొజిషన్ మీ వెన్నెముకను గంటల తరబడి ఒత్తిడికి గురిచేస్తుంది.
*బోర్లా పడుకున్నప్పుడు కాళ్లను ముఖం వైపునకు వంచి పడుకోవడం కారణంగా మెడ అసహజమైన భంగిమలోకి తిరిగి, కండరాలు బిగుసుకుపోతాయి. నరాలు ఒత్తికి లోనవుతాయి. ఈ పరిస్థితి మీ దిగువ వెన్ను భాగంపై ప్రభావం చూపడంవల్ల అది సహజ వంపును కోల్పోతుంది. అలాగే ఛాతీ, కడుపు భాగం ఒత్తిడికి గురై బ్రీతింగ్ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి పడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బోర్లా పడుకున్నప్పటికీ ఒక కాలును వంచి ముఖం వైపు ఉంచడం వంటివి చేయకూడదు. దీనివల్ల వెన్ను, మెడ, కండరాల నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
బోర్లా పడుకోవడం కలిగే సమస్యలు
*మెడపై ఒత్తిడి: ముఖం ఒక వైపు తిరిగి ఉండటం వల్ల మెడ కండరాలు బిగుసుకుపోతాయి. నరాలు ఒత్తిడికి గురవుతాయి. మెడ నొప్పి, తలనొప్పి వస్తుంది.
*వెన్నుముక సహజ వంపులో మార్పు: బోర్లా పడుకున్న పరిస్థితి సరిగ్గా లేకుంటే దిగువ వెన్ను భాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇధి దాని సహజమైన 'S' ఆకారం కోల్పోతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ పెరుగుతుంది.
*శ్వాస సమస్యలు: ఛాతీ & కడుపు బెడ్‌పై ఆనించినప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం కష్టంగా మారవచ్చు. ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
* కండరాల దృఢత్వం: గంటల తరబడి అసహజ స్థితిలో ఉండటం వల్ల భుజాలు, మెడ, వెన్ను కండరాలు గట్టిపడతాయి. దీంతో ఫ్రీగా ఉండలేరు. దీర్ఘకాలికంగా బోర్లా పడుకోవడం కొనసాగిస్తే స్పైనల్ అలైన్‌మెంట్ దెబ్బతిని, డిస్క్ సమస్యలు, స్కోలియోసిస్ లాంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link






