ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని కేలరీలు కరుగుతాయో తెలుసా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-16 00:15:52  IST  )

ప్రతిరోజూ 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ (Skipping) చేయడం వల్ల సుమారు 150-200 కేలరీలు ఖర్చవుతాయి. దీనివల్ల కొవ్వు సులభంగా కరిగిపోయి.. బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి స్కిప్పింగ్ చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని కేలరీలు కరుగుతాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ (Skipping) చేయడం వల్ల సుమారు 150-200 కేలరీలు ఖర్చవుతాయి. దీనివల్ల కొవ్వు సులభంగా కరిగిపోయి.. బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి స్కిప్పింగ్ చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ వ్యాయామంలో జంప్ చేస్తూ ఉండటం వల్ల, పది నిమిషాల్లో ఒక మైలు పరిగెత్తినంత ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి దోహదపడుతుంది. దీనివల్ల హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. స్కిప్పింగ్ మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే జంప్ చేయడానికి మెదడు సరైన సంకేతాలను పంపుతుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపర్చుకోవడానికి సహాయపడుతుంది.

ఎముకలు బలంగా, మరింత దృఢంగా మారతాయి. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు నివారించబడతాయి. కండరాల బలాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు, పొత్తి కడుపు కండరాలు. దీనివల్ల శరీరం ఫిట్‌గా కనిపిస్తుంది.

రోజూ కొంత సమయం స్కిప్పింగ్ చేయడం వల్ల శరీర బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. నడవడానికి సహాయపడుతుంది. శరీరం తుల్లకొట్టే సమస్యలు తగ్గుతాయి. స్టామినా కూడా రెట్టింపు అవుతుంది, ఇది శారీరక పనులు చేయడానికి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫిట్‌నెస్ స్థాయి మెరుగుపడుతుంది.

స్కిప్పింగ్ చేయడం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి మనస్తత్వాన్ని అందిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. రోప్‌ను ఎగరేస్తూ మెదడుకు పనిచెప్పడం వల్ల ఫోకస్ మెరుగుపడుతుంది. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.

Next Story