60 సెకన్లలో.. 16 క్లాసికల్ మ్యుజీషియన్స్ గుర్తింపు.!

by Daayi Srishailam |

ఆ బుడ్డోడి ప్రతిభేంటో తెలుసుకుందాం

60 సెకన్లలో.. 16 క్లాసికల్ మ్యుజీషియన్స్ గుర్తింపు.!
X

దిశ, ఫీచర్స్: దుబాయ్‌లో జన్మించిన జర్మన్-తమిళ మూలాలున్న ఆరేళ్ల శివాంఖ్ వరుణ్ వరదరాజన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 60 సెకన్లలో మెలోడీ పోటీలో 16 మంది ప్రసిద్ధ మ్యుజీషియన్స్‌ను గుర్తించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఆ బుడ్డోడి ప్రతిభేంటో తెలుసుకుందాం.

గిన్నిస్ రికార్డ్..

సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధులైన ప్రముఖ మ్యుజీషియన్స్ బాఖ్.. మోజార్ట్.. బీతోవెన్.. చోపిన్‌.. వివాల్డి, వాగ్నర్.. డ్వోరాక్.. మెండెల్సోహ్న్.. లిస్జ్.. రిచర్డ్ స్ట్రాస్.. జోహాన్ స్ట్రాస్.. రాసినీ వంటివారిని 60 సెకన్లలో గుర్తించాడు శివాంఖ్. మనోడి సహజ ప్రతిభను.. తల్లి ఆసక్తిని మెచ్చుకొని గిన్నిస్ అధికారులు ఈ రికార్డును నమోదు చేశారు. శివాంఖ్ ప్రతిభను రెండున్నరేళ్ల వయసులోనే గుర్తించారు పేరెంట్స్. టామ్ అండ్ జెర్రీ వంటి కార్టూన్‌లలోని ట్యూన్‌లను విని హమ్ చేసేవాడు. పిల్లలంతా సింపుల్ సాంగ్‌లు గుర్తుంచుకుంటే శివాంఖ్ క్లాసికల్ ట్యూన్‌లలోని బాఖ్ లేదా మోజార్ట్ ట్యూన్‌లను వెంటనే గుర్తించేవాడు.

న్యూరోడైవర్జెంట్ దృక్పథం..

శివాంఖ్ వరుణ్ వరదరాజన్ న్యూరోడైవర్జెంట్ పిల్లల్లో ఉన్న ప్రత్యేకతను చూపిస్తున్నాడని నిపుణులు చెప్తున్నారు. అంటే.. మెదడు పనితీరు వేరుగా ఉండే పిల్లవాడు అన్నమాట. అతడి సక్సెస్‌ను చూసి పిల్లలను ఎలా ఎంకరేజ్ చేయాలో అనేది తెలుసుకోవాలి పేరెంట్స్. శివాంఖ్ తల్లి యలిని అతడి ప్రత్యేక ఆసక్తులను ఎప్పటికప్పుడు గుర్తించేది. చిన్న వయసులో సంగీత అభిరుచిని వ్యక్తం చేయడం ద్వారా న్యూరోడైవర్జెంట్ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. శివాంఖ్ ఇంట్లో ఎప్పుడూ ఏవో వాయిస్తూ మ్యూజిక్‌ ద్వారానే మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు.

పేరెంటింగ్ లెస్సన్..

చిన్న వయసులో సంగీత ప్రతిభను చాటినవాళ్లెంతో మంది ఉన్నారు. శివాంఖ్ మొదటివాడేం కాదు. కానీ అతడు క్లాసికల్ మ్యుజీషియన్స్‌ను వేగంగా గుర్తించే నైపుణ్యంలో కొత్త రికార్డు సృష్టించాడు. శివాంఖ్‌ టాలెంట్ సంగీతంతో పాటు రచన.. పర్ఫామెన్స్‌తో పాటు వేగవంతమైన వినగలిగే నైపుణ్యాన్ని కలిగివున్నాడని చెప్తున్నారు నిపుణులు. వయసు.. నేపథ్యాలకు అతీతంగా ప్రతిభ ఆవిర్భవిస్తుందని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. విద్యా విధానాలు మారుతున్న సమయంలో చిన్నారుల ఇలాంటి ప్రతిభలను గుర్తించి వాటిని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతీ పేరెంట్‌పై ఉంది.

Next Story