Viral Video : అరేయ్ ఏంట్రా అది..! బతకాలని లేదా ?

by Javid Pasha |

Viral Video : అరేయ్ ఏంట్రా అది..! బతకాలని లేదా ?

Viral Video : అరేయ్ ఏంట్రా అది..! బతకాలని లేదా ?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా(Social media)లో తరచుగా వైరల్ అయ్యే కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయ్. మరికొన్ని అలర్ట్‌నెస్‌ను పెంచుతుంటాయ్. ఇంకొన్ని చిరాకు తెప్పిస్తుంటాయ్. అప్పుడప్పుడూ కొన్ని దృశ్యాలు, సన్నివేశాలు, ముఖ్యంగా యువత చేసే వెరైటీ బైక్ స్టంట్లు(Bike stunts) మనలో ఏదో ఒక సీరియస్ ప్రతి స్పందనకు కారణం అవుతుంటాయ్. అటువంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో కొందరు పోరగాళ్లు చేసిన పనికి మొదట నవ్వొచ్చినా.. తర్వాత కోపం వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో(Viral Video) ప్రకారం.. అది ఇరువైపుల పంట పొలాలు, పచ్చని చెట్లు కలిగి ఉన్న ఒక రోడ్డు. దాని కింద నుంచి నీటి ప్రవాహం కోసం తవ్విన ఓ కాలువ ఉంది. అందులో నీళ్లు కూడా ఉన్నాయి. ఇక కాలువ ఒడ్డున చెట్లకింద కొందరు పిల్లలు, పెద్దలు నిలబడి ఉన్నారు. రోడ్డుపై నుంచి అప్పుడప్పుడూ వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అంతలోనే ఆరుగురు యుక్త వయస్కులైన పోరగాళ్లు (teenagers) బైకుమీద ఇరుకిరుకుగా కూర్చొని, నీటి కాలువలోంచి బైకును నడిపేందుకు (ride a bike through a canal)రెడీగా ఉన్నారు. వాళ్లను చూస్తుంటే వెరైటీ స్టంట్ (Variety stunt)కోసం ప్రిపేర్ అయినట్లుంది. కానీ అది అత్యంత ప్రమాకరమైనదిగా కనిపిస్తోంది.

సరిగ్గా ఆ సందర్భంలోనే రోడ్డు(road)పై నుంచి వెళ్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్(police constable) బైకుమీద స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు యువకులను గమనించినట్టున్నాడు. యువకులు కెనాల్ నీటిలోకి బైకును పోనిస్తుండగానే కానిస్టేబుల్ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి(Come running), ఒక్కసారిగా కాలువలోకి దూకి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. దీంతో బైకుమీద నుంచి దూకిన యువకులు తలో దిక్కున పారిపోతారు. ఒక యువకుడు మాత్రం బైకుతో పాటు దొరికిపోగా.. కానిస్టేబుల్ అతన్ని పట్టుకొని చితక బాదుతాడు. కాగా ‘పోలిస్ ఆగయా’ అనే క్యాప్షన్‌తో lalbabu_official9 అనే ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయబడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి మరి!

Next Story