- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాడటం వినోదం మాత్రమే కాదు.. ఆరోగ్య రహస్యం కూడా!
సింగింగ్ అనేది సంగీతాన్ని వినడంతో పోలిస్తే మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : పాటలు పాడటం లేదా వినడం కేవలం కళ, వినోదం మాత్రమే కాదండోయ్.. ఈ అలవాట్లు ఆరోగ్యానికి ఔషధం లాంటివని కూడా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జర్నల్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్ (Journal of Behavioral Medicine) 2004 నాటి స్టడీ సహా పలు ఇతర పరిశోధనలు సైతం దీనిని నిరూపించాయి. సింగింగ్ అనేది లాలాజలంలో sIgA అనే యాంటీబాడీ స్థాయిలు పెంచుతుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా ఇది ఎగువ శ్వాసనాళ మార్గాన్ని వైరస్‌ల నుంచి రక్షించే ముఖ్యమైన ప్రొటెక్టివ్ యాంటీబాడీ కూడాను. అయితే ఈ పెరుగుదల చాలా త్వరగా, ఒక సింగింగ్ సెషన్ తర్వాతనే జరుగుతుందని నిపుణులు గుర్తించారు. ఇక గ్రూపుగా కలిసి పాడినప్పుడు లేదా సంగీత కచేరీల్లో పాల్గొన్నప్పుడు ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
సింగింగ్ అనేది సంగీతాన్ని వినడంతో పోలిస్తే.. మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని అధ్యయనాలను విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని పరిశోధనలు sIgA (Secretory Immunoglobulin A) స్థాయిలు పెరిగినట్లు చూపించాయి. కానీ ఆ పెరుగుదల పరిమాణం వ్యక్తి నుంచి వ్యక్తికి, భావోద్వేగాలు (పాజిటివ్ మూడ్), గ్రూప్ సెట్టింగ్ వర్సెస్ సోలో సింగింగ్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని కూడా చూపించాయి. మొత్తానికి పాడటమనేది మానసిక స్థితిని మెరుగు పర్చడమే కాకుండా తద్వారా శరీరంలో యాంటీబాడీలను ప్రేరేపించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
అధ్యయనాల ప్రకారం. పాడటమనేది లోతైన, లయబద్ధమైన శ్వాసను ప్రోత్సహిస్తుంది. స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల ఇమ్యూన్ మార్కర్లు సహజంగానే పెరుగుతాయి. అంతేకాకుండా గానం చేసినప్పుడు సానుకూల మానసిక స్థితితోపాటు సామాజిక సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఇవి శరీరంలో ఒత్తిడిస్థాయిలను తగ్గించి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పాడటం లేదా వినడం వంటివి ఆరోగ్యానికి అదనపు సహాయం మాత్రమే. వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయం ఏమాత్రం కాదు.






