నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా దిగొచ్చిన చికెన్ ధరలు

by Anjali |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా దిగొచ్చిన చికెన్ ధరలు
X

దిశ, ఫీచర్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్, మటన్ షాపుల్లో క్యూ కడతారు. సండే చాలా మందికి ముక్క లేనిది ముద్ద దిగదు. మిగతా రోజులు ఎలా ఉన్నా సరే కానీ ఆదివారం మాత్రం తప్పకుండా నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది ఆదివారం మాత్రమే చికెన్ తింటే మరికొంతమంది వారంలో నాలుగైదు సార్లు చికెన్ తింటారు. దీంతో చికెన్ రేట్లు వారానికి ఒక్కసారైనా కొండెక్కి కూర్చొంటాయి. సామాన్యులు చికెన్ కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ప్రస్తుతం ఈ నెల (ఆగస్టు) శ్రావణమాసం కావడంతో చికెన్ రేట్లు వరుసగా పడిపోతూ వస్తున్నాయి.

శ్రావణమాసంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు. ఫాస్టింగ్ చేపట్టినవారు నాన్ వెజ్ కు మొత్తమే దూరంగా ఉంటారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నెలతో పోలిస్తే ఈ నెల చికెన్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. గత నెలలో చికెన్ రేట్లు కేజీ 300 రూపాయలుగా ఉండేది. వరలక్ష్మి వ్రతం అండ్ శ్రావణమాసం నేపథ్యంలో చాలా వరకు చికెన్ కొనేవారు తగ్గడంతో ప్రస్తుతం డ్రెస్సింగ్ కోడి కేజీ 150 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే స్కిన్ లెస్ రూ. 160 నుంచి 180 రూపాయల వరకు ఉంది.

Next Story