రీల్స్.. ఆల్కహాల్ కన్నా ఐదు రెట్లు డేంజరస్.. కానీ ఎందుకు?

by Sujitha Rachapalli |

మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే హెచ్చరికలు వింటూనే ఉంటాం.. కానీ దీనికి మించి ఐదు రెట్లు ప్రమాదకరం రీల్స్ అని తాజా అధ్యయనం వెల్లడించింది.

రీల్స్.. ఆల్కహాల్ కన్నా ఐదు రెట్లు డేంజరస్.. కానీ ఎందుకు?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా మన డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. లేవగానే స్టేటస్‌లు, అప్డేట్స్ చూడటం అలవాటు అయిపోయింది. అప్పటి నుంచి మొదలుపెడితే రాత్రి ఒంటి గంట అయ్యే వరకు కూడా ఫోన్ చూస్తునే ఉంటం. రీల్స్, షాట్స్ చూడటం మొదలుపెడితే అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. ఒక్కసారి అందులో తలదూర్చామంటే మినిమమ్ రెండు గంటలు అయితేనే బయటకు వచ్చేది. కానీ ఇలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ నిరంతరం చూడటం.. వేగంగా మారే డిజిటల్ కంటెంట్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం మెదడు రివార్డ్ సర్క్యూట్‌ను గణనీయంగా మార్చేస్తుందని హెచ్చరిస్తున్నారు న్యూరోసైన్స్ పరిశోధకులు.

మెదడులోని డోపమైన్, రివార్డ్ సిస్టమ్ ఈ షార్ట్ వీడియోల ద్వారా ప్రభావితమవుతుంది. వేగంగా మారే షాట్స్.. లైక్స్, స్వైప్‌ల ద్వారా మెదడులో డోపమైన్ స్పైక్‌లను తరచుగా ఉత్పత్తి చేస్తాయి. ఇది గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ అడిక్షన్‌లలో ఉండే వేరియబుల్ రివార్డ్ సిస్టమ్‌ను పోలి ఉంటుంది. ఐదు రెట్లు ప్రమాదకరం కూడా. ఈ పదే పదే డోపమైన్ స్పైక్‌లు మెదడును తక్షణ సంతోషం కోసం శిక్షణ ఇస్తాయి. దీర్ఘకాలంలో మెదడు డోపమైన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. దీంతో సాధారణ పనులు అంటే పుస్తకం చదవడం, జనాలతో మాట్లాడంపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఒకవేళ చేయాల్సి వస్తే ఎక్కువ శ్రమతో కూడుకున్నట్లుగా అనిపిస్తాయి. ఇది మోటివేషన్, సెల్ఫ్-రెగ్యులేషన్‌కు సంబంధించిన న్యూరల్ పాత్‌వేలను మార్చేస్తుంది.

2025లో వచ్చిన మెటా-అనాలిసిస్‌లు షార్ట్-ఫాం వీడియో వాడకం ఎక్కువగా ఉన్నవారిలో అటెన్షన్, ఇన్‌హిబిటరీ కంట్రోల్ తగ్గుతాయని చూపించాయి. దాదాపు లక్షమందికి పైగా పాల్గొన్న 71 అధ్యయనాల్లో.. స్ట్రెస్, యాంగ్జైటీ పెరుగుతాయని తేలింది. హెవీగా షాట్స్ చూసేవారిలో అటెన్షన్ తగ్గి.. డిస్ట్రాక్ట్ కావడం పెరుగుతుంది. అంటే సాధారణ పనుల మీద కూడా ఫోకస్ చేయలేరు. వర్కింగ్ మెమరీ, ఇన్‌హిబిషన్ బలహీనపడతాయి. EEG, fMRI స్టడీస్‌లో రివార్డ్ సర్క్యూట్ (VTA, అమిగ్డాలా) ఓవర్-ఆక్టివేట్ అవుతుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (కంట్రోల్ సెంటర్) యాక్టివిటీ తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలు, యువకులలో ఈ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అల్గారిథమ్-డ్రైవెన్ కంటెంట్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచేసి... ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ చూసే సమయాన్ని అరగంటగా నిర్ణయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. డిజిటల్ బ్రేక్‌లు తీసుకోవాలని.. బుక్ రీడింగ్, వాకింగ్, మెడిటేషన్ వంటివి చేయాలని చెప్తున్నారు.

Next Story