- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: తారక్ పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో తెలిస్తే షాక్ తినడం ఖాయం.. మరి ఇంత దారుణమా..?
Viral Video: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎదిగి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా జెండా పాతుతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎదిగి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా జెండా పాతుతున్నాడు. ఇప్పటికే దేవర సినిమాతో ఫ్యాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్, ఏకంగా బాలీవుడ్ లో వార్ 2 సినిమా ద్వారా తన సత్తా ఏంటో చాటేందుకు సిద్ధమైపోయాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు జపాన్లో కూడా ఆయనకు గుడి కట్టేంత ఫ్యాన్స్ ఉన్నారు.
ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తి చూపుతున్నారు అంటే అతిశయోక్తి కాదు అని చెప్పవచ్చు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న ఏ చిన్న విషయమైనా వైరల్ అవడం ఖాయం. ఆయన తాజాగా ఒకప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇంటర్వ్యూలో తన పెళ్లి చూపులప్పుడు జరిగిన సంఘటన షేర్ చేసుకున్నారు. ఆ పెళ్లిచూపుల్లో తన సతీమణి ఏమి మాట్లాడలేదని తాను ఎస్ అని చెప్పేసి వెళ్లిపోయానని కానీ తనకు తాను ఇష్టమో లేదో అన్న సంగతి ఎస్ అని చెప్పలేదని, ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు 8 నెలల గ్యాప్ ఉన్నప్పటికీ ఆ మధ్యలో కూడా ఎప్పుడు మాట చెప్పలేదని, తనకు కూడా ఎస్సో కాదో అన్న డౌట్ వచ్చిందని నవ్వులు పూజించాడు తారక్. ఆడవాళ్లను అర్థం చేసుకున్న వాడు ప్రపంచంలో దేనినైనా అర్థం చేసుకుంటాడు అంటూ తారక్ తన మార్క్ డైలాగును వదిలాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.






