చికెన్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. ఇష్టమని అతిగా తింటున్నారా? తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే?

by Yella Dhawani Reddy |

నాన్ వెజ్ (Non-veg) లవర్స్‌ ఎక్కువగా చికెన్‌ (Chicken) తినేందుకు ఇష్టపడుతుంటారు.

చికెన్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. ఇష్టమని అతిగా తింటున్నారా? తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: నాన్ వెజ్ (Non-veg) లవర్స్‌ ఎక్కువగా చికెన్‌ (Chicken) తినేందుకు ఇష్టపడుతుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. మధ్యాహ్నం భోజనానికి కోడి కూర ఉండాల్సిందే. కొంతమంది అయితే రోజూ చికెన్‌ను లాగించేస్తుంటారు. పైగా చికెన్‌లో విటమిన్ 12, కొలైన్ పుష్కలంగా ఉంటాయి. రెడ్ మీట్‌తో పోలిస్తే హెల్త్ రిస్క్‌లు తక్కువ.. అందుకే డాక్టర్లు కూడా తినమని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే వార్త మాత్రం చికెన్ లవర్స్‌‌ను షాకింగ్‌కు గురించేస్తుంది. ఎందుకంటే.. చికెన్‌ను అతిగా తినటం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.

పలు రకాల పౌల్ట్రీ ఉత్పత్తులు (కోడి, టర్కీ, బాతు లాంటి మాంసాలు) తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం చేపట్టారు. దాదాపు 19 సంవత్సరాలు 4 వేల మందికి పైగా వ్యక్తులపై ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తేలింది. అంతేకాదు, పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి వ్యాధులను గుర్తించారు. ఇలా పరిమితికి మించి మాంసం తింటున్న వాళ్లలో సుమారు 27 శాతం మంది ఏదో ఓ జబ్బు బారిన పడుతున్నారు. ముఖ్యంగా వీళ్లలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. వీరు చనిపోయే ప్రమాదం కూడా 27 శాతం అధికంగా ఉంది. ఇక వారానికి 200 గ్రాముల చికెన్ తిన్న వాళ్లలోనూ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చిన వాళ్లున్నారు.

అయితే, చికెన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి 100 గ్రాముల వరకు తింటే ఎలాంటి ముప్పు ఉండదన్నారు. రోజూ కాకుండా గ్యాప్ ఇస్తూ వారానికి ఒకటి, రెండు సార్లు తినడం మంచిదని సూచిస్తున్నారు.

Next Story