Adnan Sami: పహల్గాం టెర్రర్ అటాక్‌పై స్పందించిన పాక్‌ సింగర్‌.. కానీ ప్రభుత్వం మాత్రం ప్చ్...!

by Vennela |

Adnan Sami: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Adnan Sami: పహల్గాం టెర్రర్ అటాక్‌పై స్పందించిన పాక్‌ సింగర్‌.. కానీ ప్రభుత్వం మాత్రం ప్చ్...!
X

దిశ, వెబ్ డెస్క్: Adnan Sami: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆశ,వాగ్దానాలతో నిండిన అమాయక జీవితాలను దారుణంగా ముగించారని మండిపడ్డారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడిపై హిందీ సినిమా తారలే కాకుండా పాకిస్తాన్ కళాకారులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమీ కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సంతాపం తెలుపుతూ పోస్ట్ చేశారు. ఒక మనిషి, సాటి మనిషిపై ఇంత నీచత్వానికి, అనాగరికతకు ఎలా దిగగలడని ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై అద్నాన్ సమీ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. పహల్గామ్ దాడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వార్తలు, భయంకరమైన దృశ్యాలను చూసిన తర్వాత నా గుండె బద్దలైందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ రాశారు. గంభీరమైన పర్వతాలు, నిర్మలమైన లోయల మధ్య ఇంత అందమైన ప్రదేశంలో జరిగిన ఈ దుర్మార్గం ఖండిస్తున్నాను అన్నారు. ఆశలు, వాగ్దానాలతో నిండిన అమాయక జీవితాలు కన్నీళ్లు, విరిగిన కలలు, భరించలేని దుఃఖాన్ని మిగిల్చి క్రూరును కఠినంగా శిక్షించాలన్నారు.

మానవత్వం ఎలా దిగజారిపోతుందని ప్రశ్నించాడు. ఈ విషాద చిత్రాన్ని ఎప్పటికీ మరచిపోలేము. అమాయక ప్రజల ప్రాణాలను తీసిన ఈ సంఘటన చరిత్రలో ఎప్పటికీ ఒక భాగంగా ఉంటుంది. ఈ నష్టాన్ని, భరించలేని దుఃఖాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధితుల పట్ల నా ఆలోచనలు ఉన్నాయి. వారు ముందుకు సాగడానికి బలం పొందాలని... ఈ ఉగ్రవాదాన్ని మనం శాశ్వతంగా అంతం చేయాలని పిలుపునిచ్చారు.అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఉంది. జనవరి 1, 2016న పొందాడు. అద్నాన్ ఎల్లప్పుడూ భారతదేశానికి మద్దతు ఇస్తుంటాడు.



Next Story