- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైస్పీడ్ ట్రైన్ కారిడార్ సెంటర్‌గా శంషాబాద్
ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. కాగా అంతర్జాతీయ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. కాగా అంతర్జాతీయ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. తాజాగా హైదరాబాద్ నగర రవాణా సౌకర్యం కూడా మెరుగుపరిచేందుకు అనువైన ప్రాజెక్టులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి దేశంలోని ఇతర పట్టణాలకు కనెక్టివిటీని పెంచే విధంగా ట్రైన్ హైస్పీడ్ కారిడార్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ కారిడార్లను రూపొందించనున్నది. ఇందులో మూడు తెలంగాణ వైపే ఉండడం విశేషం. హైదరాబాద్-బెంగళూరు, పుణే- హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై మధ్య హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు నిర్మించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.
గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త చెప్పింది. హై స్పీడ్ ట్రైన్ కారిడార్లను కేటాయించినట్లు తెలిపింది. దశాబ్దాల కలగా మిగిలిన ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కుతుండగా.. ఇటీవల 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో మెుత్తం ఏడు నగరాల మధ్య హైస్పీడ్ ట్రైన్ కారిడార్లు ఉంటాయని తెలిపారు. అందులో హైదరాబాద్ నుంచి మూడు ఉండడం గమనార్హం. హైదరాబాద్ నుంచి పుణే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైల మధ్య హై స్పీడ్ మెట్రో ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటితో పాటు ముంబై నుంచి పుణే, చెన్నై నుంచి బెంగళూరు, ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి సిలిగుడి వరకు కారిడార్లు ఏర్పాటు కాబోతున్నాయి.
గంటల్లోనే గమ్యానికి..
కేంద్రం ప్రకటించిన హై స్పీడ్ ట్రైన్ కారిడార్ల ద్వారా గంటల కొద్దీ సాగే రైలు ప్రయాణం తగ్గనుంది. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లే ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతోపాటు అందరికీ ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి మెట్రో నగరాల మధ్య దూరం తగ్గి, రవాణా అత్యంత వేగంగా మారుతుంది. ఈ ట్రైన్ కారిడార్లు కేవలం రవాణాకే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడనున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్‌ను ఒక ప్రధాన ఆర్థిక హబ్‌గా మార్చనున్నాయని చెబుతున్నారు. ఈ మూడు హైస్పీడ్ కారిడార్లు పట్టాలెక్కితే హైదరాబాద్ దేశంలోనే చాలా రంగాల్లో కీలక డెస్టినేషన్‌గా మారుతుందని భావిస్తున్నారు.
రైల్వే విస్తరణ
తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ మునుపెన్నడూ లేని రీతిలో విస్తరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల విద్యుదీకరణ 100% ఇప్పటికే పూర్తి చేయగా మరో 900 కి.మీకి పైగా కొత్త లైన్ల ద్వారా రైల్వే నెట్‌వర్క్ విస్తరించింది. తాజా బడ్జెట్ 2026-2027లో హైదరాబాద్ (శంషాబాద్) నుంచి మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించినట్లు తెలిపారు.
రైల్వే అభివృద్ధి
✅తెలంగాణలో రైల్వే లైన్ల విద్యుదీకరణ 100% పూర్తి
✅హైదరాబాద్ (శంషాబాద్) నుంచి 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు
✅ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 40 అమృత భారత్ స్టేషన్ల పురోభివృద్ధి
✅900+ కి.మీ కొత్త ట్రాక్‌ల నిర్మాణం మరియు 5 వందే భారత్ రైళ్లు
✅రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం ₹47,984 కోట్ల పనులు






