అంగం వంకరగా ఉంది..! అందుకు పనికి వస్తానా మేడం..?

by Javid Pasha |   (  Updated:2025-08-29 10:25:25  IST  )

పెళ్లికి ముందు కాబోయే భార్య అయినా సరే.. సెక్స్ చేయకూడదు. రేపు నీకేమైనా అయితే ఆమె పరిస్థితి ఏంటి? టీనేజ్ గర్భధారణ ఆమెను ప్రమాదంలో పడేస్తుంది.

అంగం వంకరగా ఉంది..! అందుకు పనికి వస్తానా మేడం..?
X

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలతోపాటు శృంగారం కూడా ఒక ముఖ్యమైన భాగం. సెక్స్‌పట్ల సరైన అవగాహన లేకపోతే.. పలు అపోహలకు, అపార్థాలకు, అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి శృంగారపరమైన విషయాలపట్ల పరిజ్ఞానం అవసరం అంటున్నారు ప్రముఖ సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్, ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్ డాక్టర్ భారతిగారు. పాఠకులు అడిగిన సెక్స్ పరమైన సందేహాలకు ఆమె చెప్పిన సమాధానాలేమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న: మేడం నా వయసు19 సంవత్సరాలు. నా అంగం కింది భాగంలో వంకరగా ఉంది. నా చిన్నప్పుడు మా మామయ్య నామీద చాలా సార్లు లైంగిక దాడి చేశాడు. అప్పుడు నాలుగు సార్లు నా అంగానికి దెబ్బలు తగిలాయి. ఈ మధ్య నాకు కాబోయే భార్య అయిన, నా మరదలితో సెక్స్‌లో బాగానే పాల్గొన్నాను. అలాగే నాకు నిద్రలో వీర్యం పోతున్నది. ఈ స్థితిలో పెళ్లయిన తర్వాత సెక్స్‌కి పనికి వస్తానా.. లేదా? అని భయం వేస్తోంది దయచేసి నా సమస్యకు మీరే పరిష్కారం చూపించగలరు. - బీకేఆర్. నిజామాబాద్.

జవాబు : అంగం స్తంభించాక కూడా కుడి లేదా ఎడమల వైపుకి కొద్దిగా వంకర అవుతుంది. అయితే అది అంగప్రవేశానికి ఏమాత్రం అడ్డం కాదు. కానీ అరటిపండు ఆకారంలో ఎక్కువగా ముడుచుకు పోతేనే సెక్స్‌కి ఇబ్బంది అవుతుంది. దాన్ని సరి చేయడానికి సర్జరీలు ఉన్నాయి. పైగా నువ్వు సెక్స్‌లో పాల్గొన్నావు కాబట్టి, నీకు ఆ సమస్య లేనట్లే. అయితే పెళ్లికి ముందు కాబోయే భార్య అయినా సరే.. సెక్స్ చేయకూడదు. రేపు నీకేమైనా అయితే ఆమె పరిస్థితి ఏంటి? టీనేజ్ గర్భధారణ ఆమెను ప్రమాదంలో పడేస్తుంది. కాబట్టి మున్ముందు అలాంటివి చేయకు. అలాగని, నీ శక్తి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి వేరే స్త్రీల దగ్గరికి కూడా వెళ్లొద్దు. ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. నీతో పాటు నీ భార్యకీ అంటుకుంటాయి. కాబట్టి బాధ్యతగా ఉండాలి. ఇక నువ్వు శృంగారంలో పాల్గొనడంవల్ల అంగం చిన్నదిగా, వంకరగా అవదు. అంగం గట్టి పడే ముందు 7 నుంచి 12 సెంటీమీటర్లు ఉంటుంది. అది చిన్నగా ఉండడం కాదు. గట్టిపడ్డాక మాత్రమే అంగం శృంగారానికి పనికొస్తుంది. ఇక నిద్రలో వీర్యం పోవడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు. నీ లైంగిక అవయవాలు సరిగ్గా పని చేస్తున్నాయనే దానికి ఇదొక నిదర్శనం. పెళ్లికి ఇంకా సమయం ఉంది కాబట్టి సెక్స్ పరమైన ఆందోళన తగదు. ఈ రకమైన ఆలోచనలు, ఆందోళనలు తగ్గకపోతే సెక్సాలజిస్టును కలువు. అంగానికి దెబ్బ తగిలింది అంటున్నావ్ కాబట్టి డాక్టర్ స్టడీ చేయాలి.

డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story