- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cherries : ఈ ఒక్క తింటే పండు చాలు.. ఎసిడిటీ, క్యాన్సర్ అన్నీ పరార్ !
Cherries : ఈ ఒక్క తింటే పండు చాలు.. ఎసిడిటీ, క్యాన్సర్ అన్నీ పరార్ !

దిశ, ఫీచర్స్ : చెర్రీ పండ్లు.. చూడ్డానికి చిన్నగా, ఎర్రగా ఉండే ఈ ఫలాలు ఆరోగ్య సంరక్షణలో మాత్రం కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాకుండా వీటిలోని పోషకాలు, విటమిన్లు, సమ్మేళనాలు ఎసిడిటీని తగ్గించడంలో, క్యాన్సర్ నివారణలో అద్భుతంగా సహాయపడతాయని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. అదెలాగో చూద్దాం.
*సహజంగానే పండ్లు ఆరోగ్యానికి మంచిది. అయితే చెర్రీ పండ్లలో (Especially tart cherries and sweet cherries) యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, ఆంథోసైనిన్స్, క్వెర్సెటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంతో కణాలకు హాని కలిగించి క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో సహాయపడతాయి అంటున్నారు నిపుణులు. 2020లో Nutrition and Cancer జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం (Layosa MAA et al) డార్క్ స్వీట్ చెర్రీ ఎక్స్‌ట్రాక్ట్ రొమ్ము క్యాన్సర్ కణాల (MDA-MB-453)లో అపోప్టోసిస్ (కణ మరణం)ను ప్రేరేపించిందని, అలాగే MAPK డిపెండెంట్ సిగ్నలింగ్ ద్వారా కణ వ్యాప్తిని తగ్గించిందని పరిశోధకులు కనుగొన్నారు.
*ఇక ఎసిడిటీ (acid reflux) నివారణ విషయానికి వస్తే ‘2003లో Journal of Nutrition’ మరో అధ్యయనం (Jacob RA et al) ప్రకారం చెర్రీలను తీసుకోవడం కారణంగా ప్లాస్మా యూరిక్ యాసిడ్ స్థాయిలు 5 గంటల తర్వాత గణనీయంగా తగ్గాయని పరిశోధకులు గుర్తించారు. అంటే ఎసిడిటీని నివారించడంలో ఇవి సహాయపడతాయి. అలాగే చెర్రీలలోని ఆంథోసైనిన్స్ అండ్ హైడ్రాక్సీసినమిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థలో శోథ(inflammation)ను తగ్గించడం ద్వారా ఎసిడిటీ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






