లండన్ వదిలేసి వచ్చారు.. స్వదేశీ ఆకాంక్షతో మెక్సికన్ కేఫ్ పెట్టి సక్సెస్ అయ్యారు.!

by Daayi Srishailam |

మాతృభూమిపై ప్రేమ ఉన్నవారికి తామెక్కడున్నా.. ఏం చేస్తున్నా ఇవి గుర్తుకొస్తాయి

లండన్ వదిలేసి వచ్చారు.. స్వదేశీ ఆకాంక్షతో మెక్సికన్ కేఫ్ పెట్టి సక్సెస్ అయ్యారు.!
X

దిశ, ఫీచర్స్: చదువు కోసం.. ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో స్థిరపడతాం. సంపాదనే ముఖ్యం అనుకునేవాళ్లకు ఉన్న ఊరు గుర్తుకురాదు.. కన్నవాళ్లు గుర్తుకురారు. కానీ.. మాతృభూమిపై ప్రేమ ఉన్నవారికి తామెక్కడున్నా.. ఏం చేస్తున్నా ఇవి గుర్తుకొస్తాయి. లండన్లో స్థిరపడిన 26 ఏళ్ల వయసున్న ఇద్దరు స్నేహితులకు ఇలానే స్వదేశీ ఆకాంక్ష పెరిగి.. ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు.

ఇండియాకు తిరిగి రావాలని..

ఈశ్వర్.. ప్రియ ఇద్దరు క్లాస్మేట్స్. లండన్లో సెటిలయ్యారు. ఈశ్వర్ మెక్‌డొనాల్డ్‌లో బర్గర్లు తిప్పుతూ ఉండేవాడు. ప్రియ మెక్సికన్ ఈటరీలో బురిటోలు ప్యాక్ చేసేది. ఎంతచేస్తే ఏం ఫాయిదా వచ్చే జీతాలు సరిపోయేవి కావు. ఊరొదిలి వచ్చినా తమ సంపాదన సరిపోవడం లేదు. ఇంకా ఇంటికేం పంపుతామనే దిగులు ఉండేది. నిత్యం హోంసిక్ ఫీలయ్యేవాళ్లు. ఒకరోజు వాళ్లకొక ఐడియా వచ్చింది. కస్టమర్లు మెక్సికన్ ఫుడ్ ఫ్లేవర్లను చాలా ఇష్టపడుతున్నారుగా.. ఇండియాలో ఇలాంటి కేఫ్ పెడితే బావుంటుంది అనుకున్నారు. లండన్‌కు బైబై చెప్పాలనుకున్నారు.

లాస్ టాకోస్ కేఫ్‌తో..

మన దేశం.. మన పని అనే ఆలోచనతో ఇండియాకు వచ్చిన ఈశ్వర్.. ప్రియ ఇంట్లో విషయం చెప్పారు. కానీ సానుకూల స్పందన రాలేదు. అందరూ విదేశాలకు వెళ్తుంటే మీరేంటి వింతగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హోటల్ పెడతా అంటున్నారు అని ప్రశ్నించారు. ఇంట్లో ససేమిరా అన్నప్పటికీ ఈశ్వర్.. ప్రియ ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు. రోజూ 60 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఎక్కడ పెడితే బాగుంటుంది.. ఏం పెడితే బాగుంటుంది అని స్టడీ చేశారు. అలా చివరికి ఒక అవుట్‌లెట్ దొరికింది. కేవలం ఏడు రోజుల్లోనే దాన్ని కేఫ్‌గా మార్చేశారు. దానికి "లాస్ టాకోస్" అని పేరు పెట్టారు.

అనూహ్య మలుపు..

తామొకటి అనుకుంటే ఇంకొటి జరిగింది అంటారు కదా.. వాళ్లకు అలాంటి అనుభవమే ఎదురైంది. మంచిగా నడిచే కేఫ్ నుంచి స్టాఫ్ మధ్యలోనే వెళ్లిపోయారు. భారీ వర్షాలు రోడ్డును ముంచేశాయి. రెంట్ బిల్లులు పేరుకుపోయాయి. కొన్ని రోజులు తిండి కూడా తినకుండా గడిపారు. ఇక వాళ్ల ముందున్న ఏకైక ఆప్షన్ కేఫ్‌ను వదిలేసుకోవడం. కానీ వాళ్లు నిరాకరించారు. ఆరు నెలల తర్వాత వారి ఓపికకు ఊహించని విధంగా రివార్డ్ దక్కింది. లాస్ టోకోస్‌ను రీలాంచ్ చేశారు. ఆ రోజు అనూహ్యంగా 2000 మందికి పైగా మంది వచ్చారు. కొత్తదైన.. అథెంటిక్ టేస్ట్‌ను రుచి చూసి వాళ్లు ఫిదా అయ్యారు.

ఆదర్శంగా నిలుస్తూ..

అదే ఒక టర్నింగ్ పాయింట్ అయింది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. నెమ్మదిగా వృద్ధి ప్రారంభమైంది. కట్ చేస్తే ఇప్పుడు లాస్ టాకోస్ రోజూ వందలాది కస్టమర్లకు రుచికరమైన ఫుడ్ సర్వ్ చేస్తోంది. 15 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. మెక్సికో నుంచి నేరుగా రియల్ ఇంగ్రీడియంట్స్ సోర్స్ చేస్తూ ఈశ్వర్.. ప్రియ లండన్లో కన్న తమ కలను సాకారం చేసుకున్నారు. యంగ్ డ్రీమర్స్ ఎంతోమంది వాళ్ల దగ్గరికి అడ్వయిస్ కోసం వస్తున్నారు. జీరో-వేస్ట్ లైఫ్‌స్టయిల్ ప్రొడక్ట్స్ అందిస్తూ అథెంటిక్ మెక్సికన్ ఇంగ్రీడియంట్స్‌కు ప్రసిద్ధమైన కేఫ్, డెలివరీ స్టాఫ్‌కు డిగ్నిఫైడ్ ట్రీట్‌మెంట్‌గా మార్చేశారు.

Next Story