గందరగోళం మెదడును ‘ఫ్రీజ్’ చేస్తుంది.. శుభ్రతతో 100% సూపర్ ఫోకస్ !

by Javid Pasha |

గందరగోళం మెదడును ‘ఫ్రీజ్’ చేస్తుంది.. శుభ్రతతో 100% సూపర్ ఫోకస్ !
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా..! మన చుట్టూ క్లీన్ ఎన్విరాన్‌మెంట్ లేకపోతే చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతాం. ఏదో గందర గోళ పరిస్థితుల నడుమ ఉన్న భావన ఏర్పడుతుంది. అయితే ఇటువంటి వెదర్ మన ప్రొడక్టివిటీని సైతం దెబ్బతీస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు. అంతేకాకుండా అలసటకు, నిరాశకు దారితస్తుంది. కాగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని స్వచ్ఛమైన వాతావరణం మాత్రం ఇందుకు భిన్నంగా ప్రభావం చూపుతుంది. మన మెదడుకు ప్రేరణగా మారి చేస్తున్న పనిపై ఫోకస్ పెంచుతుంది. మానసిక శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా సహాయపడుతుంది.

ఎక్కడైతే క్లీన్ ఎన్విరాన్‌మెంట్ ఉండదో అటువంటి పరిస్థితులు మానవ ఇంద్రియాలపై ప్రతికూల ఒత్తిడి(Sensory Overload)ని పెంచుతాయి. అంటే.. అక్కడి దృశ్యం, శబ్దం, వాసన, స్పర్శ వంటి అనేక సమాచారాలు ఒకేసారి మెదడుపై ఒత్తిడి తెచ్చి, ఏకాగ్రత లోపానికి, ఆందోళనకు, అలసటకు, నిరాశకు కారణం అవుతాయి. ఆటిజం, ఏడీహెచ్‌డీ, మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఏం చేయాలి?

*పరిసరాల శుభ్రత : సెన్సరీ ఓవర్‌లోడ్ సమస్య నుంచి బయటపడటానికి క్లీన్ ఎన్విరాన్‌మెంట్ అవసరం. అంటే పరిసరాలను పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, సింపుల్‌గా ఉంచుకోవాలి. అనవసర వస్తువులు, రంగు రంగుల దృశ్యాలు ఉంటే తొలగించండి. చక్కటి వెలుతురు, తక్కువ వస్తువులు ఉండేలా చూసుకోండి. మీరు పనిచేసే ప్రదేశం, గది, టేబుల్ క్లీన్‌గా ఉండాలి.

*శబ్దాన్ని తగ్గించండి (Reduce Noise): ఇయర్‌ప్లగ్స్ లేదా నాయిస్-క్యాన్సెలింగ్ హెడ్‌ఫోన్స్ ఉపయోగించండి. టీవీ, ఫోన్ నోటిఫికేషన్స్ మ్యూట్ చేయండి.

*అతి వెలుతురును నియంత్రించండి (Control Light): డిం లైట్స్, సన్‌గ్లాసెస్ లేదా కర్టెన్స్ ఉపయోగించి కాంతి తగ్గించండి. అలాగే సిస్టమ్ లేదా మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి.

*సువాసనలను తగ్గించండి (Limit Smells): స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్, క్లీనర్స్, ఫుడ్ స్మెల్స్ నివారించండి. గదిలో వెంటిలేషన్ పెంచండి లేదా న్యూట్రల్ స్మెల్ ఉంచండి.

*స్పర్శ ఒత్తిడిని తగ్గించండి (Reduce Tactile Input): సౌకర్యవంతమైన, అఫీషియల్ లుక్స్ ఇచ్చే బట్టలు ధరించండి. టైట్ జీన్స్, డార్క్ కలర్స్ నివారించండి. బరువైన బ్యాగ్‌లు, కాళ్లకు ఇబ్బందిగా అనిపించే గట్టి షూస్ నివారించండి.

*బ్రేక్ తీసుకోండి : ప్రతి 30-45 నిమిషాలకు 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ప్రశాంతమైన గదిలో కూర్చోండి. సమయం ఉంటే డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ వంటివి చేయండి.

*మల్టీ టాస్కింగ్ వద్దు : త్వరగా అయిపోవాలని మల్టీ టాస్కింగ్ చేయకండి. ఒక్కో పనిని మాత్రమే సంపూర్ణంగా, అయినంత వరకు చేయండి. మల్టీ టాస్కింగ్ వల్ల తప్పులు దొర్లుతాయి. మళ్లీ చేయాల్సి వస్తుంది.

*వ్యాయామం & నిద్ర (Exercise & Sleep): రోజూ 30 నిమిషాల నడక లేదా యోగా వంటివి మెదడు ఒత్తిడి తగ్గిస్తాయి. దీంతోపాటు 7-8 గంటల నిద్ర అవసరం. అలాగే స్క్రీన్ టైమ్ తగ్గించండి. రోజుకు ఒక గంట సేపైనా డిజిటల్ డిటాక్స్ పాటించండి. Link

Next Story