కాళ్లు, చేతులే కాదు.. అన్ని అవయవాలను తిరిగి పొందుతున్న స్పైడర్స్

by Dishanational4 |
కాళ్లు, చేతులే కాదు.. అన్ని అవయవాలను తిరిగి పొందుతున్న స్పైడర్స్
X

దిశ, ఫీచర్స్: సముద్రపు సాలెపురుగులు కత్తిరించిన చేతులు, కాళ్లను తిరిగిపొందుతాయని మీరు వినే ఉంటారు. కానీ, అంతకు మించిన మరో విషయం ఏంటంటే.. రిమూవ్ చేయబడిన శరీరంలోని బాడీ పార్ట్స్‌ను కూడా తిరిగి పొందగలవని తాజా అధ్యయనంలో తేలింది. బెర్లిన్‌లోని హంబోల్డ్ యూనివర్సిటీకి చెందిన రచయిత, పరిశోధకుడు గెర్హార్డ్ స్కోల్జ్(Gerhard Scholtz) ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. తన మొదటి అధ్యయనంలోనే ఇటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చూస్తానని ఊహించలేదన్నాడు. స్పైడర్స్, సెంటిపైడర్స్, ఆర్ర్థోపాడ్స్ వంటివి కోల్పోయిన ప్రతీ అవయవాన్ని కూడా తిరిగి పొందగలవనే విషయం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు.

తాజా పరిశోధన కోసం గెర్హార్ స్కోల్జ్ టీమ్ ఎనిమిది చిన్న కాళ్ల సముద్రపు సాలె పురుగులను సేకరించి ప్రయోగాలు నిర్వహించింది. ఇక్కడ పరిశోధకులు 23 అపరిపక్వ, పెద్ద సముద్ర సాలెపురుగుల వెనుక భాగంపై అవయవాలను కత్తిరించారు. పెద్ద, చిన్న సాలెపురుగులు ఎలా తమ అవయవాలను తిరిగి పొందుతున్నాయనేది గమనించారు. అయితే జువెనైల్ స్పైడర్స్ పూర్తిగా లేదా దాదాపుగా కత్తిరించబడిన వాటి శరీర భాగాలను తిరిగి పెంచుకోగలిగాయి. గట్, కండరాలు, పాయువు, పునరుత్పత్తి అవయవాల భాగాలను తిరిగిపొందగలిగాయి. కానీ పెద్ద సాలెపురుగులు రీజనరేట్ చేసుకోలేకపోయాయి.

మొత్తంగా అధ్యయనంలో ప్రాధాన్యం సంతరించుకున్న విషయం ఏమిటంటే.. 90 శాతం సముద్రపు సాలెపురుగులు దీర్ఘకాలికంగా జీవించి ఉండగా, 16 చిన్న సాలెపురుగులు కనీసం ఒక్కసారైనా తమ అవయవాలను, శరీర భాగాలను పునరుత్పత్తి చేసుకోగలిగాయి. శరీరం వెనుక భాగం కత్తిరించినప్పుడు 14 యంగ్ స్పైడర్స్‌లో తిరిగి పెరిగాయి. కానీ అడల్ట్ స్పెసిమెన్స్ బాడీని మోల్ట్ చేసుకోలేకపోయాయి.

ఇవి కూడా చదవండి: చాయ్-సమోసాపై మనసుపడుతున్న బ్రిటిషర్స్



Next Story

Most Viewed