Sea rocks : సముద్ర జీవులకు ప్రాణం పోస్తున్న శిలలు.. సూర్య రశ్మిలేకున్నా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తూ..

by Javid Pasha |

Sea rocks : సముద్ర జీవులకు ప్రాణం పోస్తున్న శిలలు.. సూర్య రశ్మిలేకున్నా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తూ..

Sea rocks : సముద్ర జీవులకు ప్రాణం పోస్తున్న శిలలు.. సూర్య రశ్మిలేకున్నా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తూ..
X

దిశ, ఫీచర్స్ : రాళ్లూ రప్పలు, శిలలూ శిల్పాలు.. ఇవేం పనికొస్తాయి అనుకుంటాం గానీ.. ప్రకృతిలో ప్రతీ వస్తువుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏదో ఒక రూపంలో వాటివల్ల ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి వాటిలో లోతైన సముద్రపు రాళ్లు లేదా శిలలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే అవి సముద్ర జీవులకు ప్రాణవాయువును అందిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి సహాయపడుతున్నాయి. అదెలాగో చూద్దామా !

*సముద్ర వాతావరణం, అక్కడి జీవ వైవిధ్యం‌పై పరిశోధనల్లో భాగంగా స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్స్ (SAMS)కు చెందిన శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలోని క్లారియన్-క్లిప్పర్టన్ జోన్ (CCZ) వద్ద సముద్ర గర్భంలో ఒక అద్భుతాన్ని గుర్తించారు. ఏంటంటే.. లోతైన సముద్ర గర్భంలోని రాళ్లు లేదా శిలలు కూడా మొక్కల మాదిరి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వాస్తవానికి బయటి పరిస్థితుల్లో అయితే ఆక్సిజన్ ఉత్పత్తికోసం మొక్కలకు సూర్యరశ్మి చాలా కీలకం. కానీ సముద్రంలోని శిలలు ఈ అవసరం లేకుండా ప్రాణవాయువును ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు.

*శిలలు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడం అనేది సముద్ర జలం, ఇనుము సమృద్ధ ఖనిజాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు(When seawater interacts with iron-rich minerals), రసాయన ప్రతిచర్య ద్వారా సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో జీవం ఉనికి ఎలా ఉంటుందో, సూర్యరశ్మి లేని ఇతర గ్రహాలలో జీవం మనుగడ విషయాలపై అవగాహనకోసం ఈ పరిశోధన సహాయపడుతుందని రీసెర్చర్స్ అంటున్నారు.

Next Story