Technology : వద్దనుకున్న జ్ఞాపకాలను మెదడు నుంచి డిలీట్ చేయవచ్చు..! ఆ టెక్నాలజీతో సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు

by Javid Pasha |   (  Updated:2025-09-08 06:20:36  IST  )

ఆప్టోజెనెటిక్స్ సాంకేతికత ద్వారా మెదడు కణాల మధ్య కనెక్షన్స్‌ను మార్చగల మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Technology : వద్దనుకున్న జ్ఞాపకాలను మెదడు నుంచి డిలీట్ చేయవచ్చు..!  ఆ టెక్నాలజీతో సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : మానవ జీవితంలోని అనేక అనుభవాలు మెదడులో జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతుంటాయి. అవసరమైనప్పుడు వాటిని గుర్తుచు తెచ్చుకుంటూ ఉంటాం. లేదా సందర్భానుసారంగా వాటంతట అవే ప్లే అవుతూ వాటి తాలూకు భాననలకు ఏదో ఒక అనుభూతికి లోను చేస్తుంటాయి. అయితే జ్ఞాపకాల్లోనూ పలు రకాలంటాయి. మధురమైనవే కాకుండా అత్యంత బాధాకరమైనవి కూడా కావచ్చు. అయితే విషాదకరమైన జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో వల్ల కొందరు మరింత స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యను ఎదుర్కోవచ్చు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టే ఒక అద్భుతమైన ‘ఆప్టోజెనెటిక్స్ బ్లూ లైట్ టెక్నాలజీ’ని జపనీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదేమిటో చూద్దాం.

మెదుడులోని జ్ఞాపకాలను తొలగించే పరిశోధోనలో భాగంగా టోక్యూ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ల్యాబ్‌లో ఎలుకలపై పలు ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆప్టోజెనెటిక్స్ (optogenetics)అనే సాంకేతికతను డెవలప్ చేసి, దాని ఆధారంగా నీలికాంతిని ఉపయోగించి ఎలుకల మెదడు కణాల మధ్య కనెక్షన్స్‌ను(synapses) మార్చగల మార్గాన్ని గుర్తించారు. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు మోటార్ మెమోరీస్ (learned motor skills)లనే లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం అంతకుముందుగానే ఎలుకలకు వివిధ కొత్త స్కిల్స్ నేర్పించడం, జ్ఞాపకాలు ఏర్పడే యాక్టివిటీస్‌ను ప్రోత్సహించడం వంటివి చేశారు. ఆ తర్వాత మెదడులోని నిర్దిష్ట స్పైన్స్ (memory spines) అనే చిన్న న్యూరాన్ స్ట్రక్చర్‌లపై బ్లూ లేజర్ కాంతి(Blue laser light)ని ప్రకాశింప జేశారు.

పరిశోధనలో భాగంగా ఆప్టోజెనెటిక్స్ టెక్నాలజీ నుంచి వెలువడే నీలికాంతి మెదడు భాగంలోని ‘స్పైన్స్‌’ను చిన్నదిగా మార్చి, జ్ఞాపకాలకు కారణమైన సమీప నరాలను ప్రభావితం చేసి, భద్రపర్చుకున్న లేదా నేర్చుకున్న జ్ఞాపకాలను మార్చివేసింది. అయితే ఇది కేవలం 10-20 % న్యూరాన్లను మాత్రమే ప్రభావితం చేస్తుంది. కాబట్టి మెదడులోని మిగతా జ్ఞాపకాలకు ఎటువంటి హాని జరగదని పరిశోధకుల గుర్తించారు. కాగా ప్రస్తుతం ఈ సాంకేతికత మానవులపై ప్రయోగించలేదు. కానీ ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి ఆప్టోజెనెటిక్స్(Optogenetics) బ్లూ లైటింగ్ టెక్నాలజీ జ్ఞాపకాలను తొలగించడంలోనూ సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ భవిష్యత్తులో ట్రామా పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్(PTSD) వంటి సమస్యలకు కొత్త చికిత్సలను కనుగొనడంలోనూ సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. Link

Next Story