Space Exploration : అంతరిక్షంలో మరో కొత్త గ్రహం.. అక్కడ ఏమున్నదంటే?

by Javid Pasha |   (  Updated:2025-03-13 13:45:35  IST  )

Space Exploration : అంతరిక్షంలో మరో కొత్త గ్రహం.. అక్కడ ఏమున్నదంటే?

Space Exploration : అంతరిక్షంలో మరో కొత్త గ్రహం.. అక్కడ ఏమున్నదంటే?
X

విశ్వమొక వింత..

విశ్వమొక విచిత్రం..

విశ్వమొక క్యూరియాసిటీ..

విశ్వమొక రహస్యం..

ఎంత తెలిసినా.. తెలియనివి చాలానే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు

ఇటీవల మరో విశ్వ రహస్యాన్ని కూడా గుర్తించారు

ఈ అనంత విశ్వంలో భూమి లాంటి వెదర్ కలిగిన ఇంకో ‘సూపర్ ఎర్త్’ ఉందని కనుగొన్నారు.

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌‌ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. మనిషి జీవితంలో సౌకర్యాల కల్పనకు, సైన్స్ చరిత్రలో సరికొత్త మార్పులకు దారితీస్తోంది. విశ్వ రహస్యాల ఛేదనలో ఖగోళ శాస్త్రవేత్తలకు హెల్ప్ అవుతోంది. అంగారక గ్రహంపైనే కాదు, సౌర వ్యవస్థలోని అనేక గ్రహాల ఉనికినికి కనుగొనడంలో సహాయపడుతోంది. తాజాగా స్పెయిన్‌లోని ఇన్‌స్టిట్యూటో డి ఆస్ట్రోఫిసికా డి కానరియాస్ (ఐఎసి), యూనివర్సిటీ డి లా లగున (యుఎల్ఎల్) రీసెర్చర్స్ మరో కొత్త గ్రహాన్ని కనుగొనడంలోనూ తోడ్పడింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(JWST), దాని మిడ్ - ఇన్ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్(MIRI) ద్వారా ఇది సాధ్యమైంది. గతంలో ఎప్సిలాన్ ఇండి అబ్ (Eps Ind Ab) గ్రహాన్ని కూడా వీటి ద్వారా గుర్తించారు.

*శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలో భాగంగా అక్కడి నక్షత్రాలను, గ్రహాలను చాలా సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు. గతంలోనూ ఈ రెండు భూమిలాంటి ‘సూపర్ ఎర్త్’లను గుర్తించారు. రీసెంట్‌గా నెప్ట్యూన్ కంటే చిన్నదైన HD 20794d కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దీనిని కూడా ‘మరో సూపర్ ఎర్త్‌’ అని పిలుస్తున్నారు. అయితే ఈ ప్లానెట్‌పై భూమిలాంటి వాతావరణం ఉన్నందున జీవజాలం మనుగడకు అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిని సంబంధించిన పరిశోధన వివరాలను ఆస్ట్రానమి అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ జర్నల్‌ కూడా వెల్లడించింది.

*కాగా భూమికంటే 17 రెట్లు పెద్దదైన ఈ కొత్త గ్రహం (HD 20794d) భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అక్కడ సూర్యుడిలాంటి మరో నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. అయితే ఇది ఆ నక్షత్రం చుట్టూ ఒకసారి పూర్తిగా తిరగడానికి 647 రోజులు పడుతుందట. వాతావరణం విషయానికి వస్తే.. భూమిపై మాదిరిగానే కనిపిస్తుందని, HD 20794d గ్రహంపై జీవజాలం మనుగడకు అవకాశాలు ఉండవచ్చనే ఆసక్తి కలుగుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది నక్షత్రానికి అనుకూలమైన దూరంలో ఉండటంవల్ల, భూమికంటే కూడా దాదాపు ఆరు రెట్లు ద్రవ్యరాశిని కలిగి ఉంటుందని అంటున్నారు. దాని కక్ష్య వ్యవధి (Orbital period), సూర్యుడి చుట్టూ మార్స్ తిరిగే కక్ష్య (Orbital) కంటే జస్ట్ 40 రోజుల తక్కువ వ్యవధిని కలిగి ఉంటున్నది.

*కొత్త గ్రహం(HD 20794d) ఉనికిని కనుగొనడానికి శాస్త్రవేత్తలు దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రయత్నాలు కొనసాగించారు. జేమ్స్‌వెబ్ అందుకు సంబంధించిన ఛాయా చిత్రాలను, ఇతర ఆధారాలను గుర్తించింది. ప్రస్తుతం ఈ పరిశోధన ఇతర గ్రహాలపై భూమి లాంటి వాతావరణాలను స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అట్లనే గ్రహాలపై జీవజాలం మనుగడకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందకు కీలక సమాచారం లభిస్తుందని చెబుతున్నారు. గ్రహాలపై జీవం ఎలా ఏర్పడుతుంది? ఎలా పరిణామం చెందుతుంది? అనే విషయాలపై భవిష్యత్‌లో మరిన్ని కొత్త పరిశోధనలకు, అవగామనకు HD 20794d అనే గ్రహానికి సంబంధించిన పరిశోధనలు తోడ్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Next Story