- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microscopic robots : హార్ట్ సర్జరీలకు ప్రత్యామ్నాయం.. రక్తనాళాల్లో కొవ్వును తొలగించే మైక్రో రోబోట్స్‌ను డెవలప్ చేసిన సైంటిస్టులు
Microscopic robots : హార్ట్ సర్జరీలకు ప్రత్యామ్నాయం.. రక్తనాళాల్లో కొవ్వును తొలగించే మైక్రో రోబోట్స్‌ను డెవలప్ చేసిన సైంటిస్టులు

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో హై కొలెస్ట్రాల్, తద్వారా సంభవించే గుండె జబ్బులు ప్రధానంగా ఉంటున్నాయి. వాస్తవానికి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కారణంగా గుండెకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వంటివి సంభవిస్తుంటాయి. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండెకు రక్త సరఫరాను పునరుద్ధరించడానికి సర్జరీలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. అయితే భవిష్యత్తులో ఇటువంటి ఓపెన్-హార్ట్ సర్జరీ వంటి శస్త్ర చికిత్సల అవసరాన్ని నివారించగలిగే టెక్నాలజీని సైంటిస్టుల క్రియేట్ చేశారు. అవే మైక్రో స్కోపిక్ రోబోట్స్.
సర్జరీకి ప్రత్యామ్నాయం
గుండె జబ్బులకు ప్రధాన కారణం రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడమే. అయితే దీనిని ముందస్తుగా గుర్తించినప్పటికీ వెంటనే తొలగించడం అంత సులభం కాదు. మెడికేషన్స్ ద్వారా, జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా పేరుకుపోయిన కొవ్వును కరిగించే పద్ధతులను వైద్య నిపుణులు సూచిస్తారు. ఇక ముందస్తుగా గుర్తించని వారిలో సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చాక వెంటనే సర్జరీ చేయకపోతే బతికే అవకాశం ఉండదు. అయితే సర్జరీలకు ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై పరిశోధనలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు ప్రస్తుతం రక్తనాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను క్లియర్ చేయడానికి సూక్ష్మ రోబోట్‌ల(microscopic robots)ను అభివృద్ధి చేసినట్లు నేచర్ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది. ఇవి సర్జరీ లేకుండానే గుండె జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఎలా పనిచేస్తాయి?
శాస్త్రవేత్తలు కొత్తగా డెవలప్ చేసిన మైక్రోరోబోట్స్‌ను కొవ్వు పేరుకుపోయిన రక్త నాళాలలోకి పంపుతారు. ఇవి లోపల ప్రయాణిస్తూ రక్త ప్రసరణకు ఆటంకంగా ఉన్న కొవ్వు ప్లాక్స్ (Plaque)ను గుర్తించి, వాటిని విచ్ఛిన్నం చేసి, రక్తప్రవాహాన్ని పునరుద్ధరిస్తాయి. ఎటువంటి కోతలు లేకుండానే ఈ మైక్రోస్కోపిక్ రోబోట్స్ రక్తనాళాల్లో అడ్డంగా పేరుకుపోయిన కొవ్వు ఫలకాలను కచ్చితత్వంతో తొలగిస్తాయి. సాంప్రదాయ ఓపెన్-హార్ట్ సర్జరీలతో పోలిస్తే, ఈ టెక్నాలజీ వల్ల రోగులు కోలుకునే సమయం, సమస్యలు, ప్రమాదాల రిస్క్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.






