- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే మినీ టెక్నాలజీ.. ఎలా పనిచేస్తుందంటే..
బయో ఇంజనీర్డ్ మినీ-ప్యాంక్రియాస్ రక్తంలో చక్కెర స్థాయిలను ఆటోమేటిగ్గా గుర్తించి, అవసరమైనంత ఇన్సులిన్‌ను మాత్రమే శరీరంలోకి విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత వివిధ పనులను సులభతరం చేస్తోంది. అది విస్తరిస్తున్న కొద్దీ సౌకర్యాలు, పరిశోధనలు, కొంగ్రొత్త ఆవిష్కరణలు సైతం పెరుగుతున్నాయి. రీసెంట్‌గా మెడికల్ టెక్నాలజీలో మరో అద్భుతాన్ని అభివృద్ధి శాస్త్రవేత్తలు. అదే బయో ఇంజినీర్డ్ మినీ-ప్యాంక్రియాస్. డయాబెటిస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (DRI)-మయామి, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహా పలు సంస్థలకు చెందిన సైంటిస్టుల బృందాలు ఈ సాంకేతికతపై పనిచేస్తున్నాయి. డయాబెటిస్ సమస్యకు ఇది విప్లవాత్మక పరిష్కారం అందిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఈ టెక్నాలజీ ప్రాముఖ్యత ఏమిటి? ఏ విధంగా ఉపయోగపడుతుంది? దానివల్ల చేకూరే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పనితీరు.. ప్రయోజనం
బయో ఇంజనీర్డ్ మినీ-ప్యాంక్రియాస్ నిజమైన అవయవం లాగే పనిచేస్తూ, రక్తంలో చక్కెర స్థాయిలను ఆటోమేటిగ్గా గుర్తించి, అవసరమైనంత ఇన్సులిన్‌ను మాత్రమే శరీరంలోకి విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన చెబుతున్నారు. ఇది ల్యాబ్‌లో పెంచిన సాంకేతిక నిర్మాణం అయినప్పటికీ, ప్యాంక్రియాటిక్ బీటా కణాలను పూర్తిగా అనుకరిస్తుంది. సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీ టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం డైలీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన రోగులు భవిష్యత్తులో ఈ మినీ-ప్యాంక్రియాస్‌ను శరీరంలో అమర్చుకుంటే.. ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడే అవసరం చాలా వరకు తగ్గడం లేదా పూర్తిగా తొలగిపోవడం సాధ్యం అవుతుంది.
మరో అద్భుతం !
ల్యాబ్‌లో పెంచిన ఐలెట్ కణాలతో చేసిన కొన్ని ప్రయోగాత్మక చికిత్సలు ఇప్పటికే మంచి ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి ఈ యో ఇంజనీర్డ్ మినీ-ప్యాంక్రియాస్ ఆవిష్కరణ రీజెరేటివ్ మెడిసిన్ రంగంలో మరో మైలురాయిగా మారుతుందని అంటున్నారు. ఇది అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో డయాబెటిస్ నిర్వహణ చాలా సులభం అవుతుంది. శరీరంలో 24 గంటలు నిరంతరం పనిచేసే ఈ బయోలాజికల్ ‘మినీ-అవయవం’ ద్వారా లక్షలాది డయాబెటిక్ పేషెంట్ల జీవితాలు మార్చిపోవచ్చుననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.






