- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్చువల్ టచ్‌తో రియల్ ఫీల్..! ఫింగర్‌టిప్ డివైజ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు
స్క్రీన్‌పై తాకినా రియల్ టచ్ అనుభూతిని కలిగించే ఒక పరికరాన్ని శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్స్ : ఏదైనా ఒక వస్తువును కొనాలనుకున్నప్పుడు అదెలా ఉంటుందోనని చేతిలోకి తీసుకొని పరిశీలిస్తాం. ఒకటికి రెండుసార్లు టచ్ చేసి క్వాలిటీని అంచనా వేస్తాం. మరి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు? జస్ట్ చూసి సెలెక్ట్ చేసుకోవడం తప్ప ఇక్కడ టచ్ చేయలేం. ఫోన్, ట్యాబ్, డెస్క్ టాప్‌పై ఇలా ఏ స్క్రీన్ నుంచి అయినా వస్తువులను చూసి అనుభూతి చెందుతాం. కానీ ఇక నుంచి కేవలం చూడటమే కాదు.. వర్చువల్‌గా ఆయా వస్తువులను స్క్రీన్‌మీద టచ్ చేసినా, నిజంగానే టచ్ చేసినట్లు అనుభూతికిలోను చేసే, వేలికి ధరించగలిగే ఒక అద్భుతమైన పరికరాన్ని డెవలప్ చేశారు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇంతకీ దీనిని ఎలా ఉపయోగించాలి? ఎలా ఉపయోగపడుతుంది? ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ చర్మం మాదిరిగా..
సాంకేతిక శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఫింగర్‌టిప్ డివైజ్‌ను VoxeLite అని పిలుస్తున్నారు. దీనిని అతి సన్నటి (0.1 మిల్లీమీటర్ మందం), తేలికైన (0.19 గ్రాములు), సాగే లాటెక్స్ షీట్‌తో తయారు చేశారు. వేలి చివర తొడిగి ఉపయోగించవచ్చు. అయితే దీని లోపల టాక్టైల్ నోడ్స్ (Touch pixels) అనే చిన్న చిన్న రబ్బర్ డోమ్‌ల గ్రిడ్ ఉంటుంది. ప్రతి నోడ్‌లో కండక్టివ్ లేయర్, అలాగే ఎలక్ట్రోడ్ ఉంటాయి. వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రోఅడీషన్ (electroadhesion) ద్వారా ఘర్షణ, ఒత్తిడిని మార్చి, చర్మంపై ఒత్తిడి కలిగించి వివిధ టెక్స్చర్ల(Textures)ను అనుభూతి చేయిస్తుంది. ఈ ‘హ్యాప్టిక్స్’ టెక్నాలజీ సెకనుకు 800 సార్ల వరకు పని చేసి, మానవ చర్మం మాదిరి (human-resolution)గానే నిజంగా తాకిన అనుభూతిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
హ్యాప్టిక్స్ అంటే..
హ్యాప్టిక్స్ అంటే ‘డిజిటల్ టచ్’ టెక్నాలజీ. మరింత సింపుల్‌గా చెప్పాలంటే.. మనం ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఏదైనా వస్తువును తాకినప్పుడు వైబ్రేషన్, ఒత్తిడి వంటి నిజమైన ‘అనుభూతి’ని కలిగించే అత్యాధునిక సాంకేతికత అని చెప్పవచ్చు. అయితే ఇటీవల అభివృద్ధి చేయబడని ఈ ఫింగర్‌టిప్ డివైజ్ దీనికి మించి రెండు మోడ్లలో పనిచేస్తుంది. ఒకటి యాక్టివ్ మోడ్, రెండవది వోల్టేజ్ మోడ్. యాక్టివ్ మోడ్‌లో స్క్రీన్ లాంటి సాఫ్ట్ సర్ఫేజ్‌పై వేలు కదిపినప్పుడు, వోల్టేజ్ మార్చడం ద్వారా ఘర్షణను పెంచి లేదా తగ్గించి రఫ్ సర్ఫేస్, లెదర్, ఫాబ్రిక్, కార్డురాయ్ వంటి టెక్స్చర్ల(Textures)ను సృష్టిస్తుంది. పాసివ్ మోడ్‌లో నోడ్స్ చర్మానికి అడ్డుపడకుండా ఉంటాయి.
వర్చువల్‌తో నిజమైన అనుభూతి
పరిశీలనలో కూడా నిపుణులు వర్చువల్ టెక్స్చర్లను సరిగ్గా గుర్తించగలిగారు. నిజమైన ఫాబ్రిక్‌ల(లెదర్, టెర్రీ క్లాత్ వంటివి)ను 81% ఖచ్చితత్వంతో గుర్తించారు. నోడ్స్ స్పేసింగ్ 1 మిల్లీమీటర్ వరకు ఉండి, 110 నోడ్స్ వరకు సెంటీమీటర్‌కు ఉండవచ్చు. అయితే ఇప్పటికీ రీసెర్చ్ స్టేజ్‌లో ఉన్న ఈ టెక్నాలజీ భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, గేమింగ్, VR/AR అనుభవాలు, రిమోట్ కంటరోల్ సిస్టమ్స్, అలాగే విజువల్ ఇంపెయిర్డ్ వంటి వ్యక్తులకు సహాయక సాధనాల్లో ఉపయోగపడుతుంది. ఫ్లాట్ గ్లాస్ స్క్రీన్‌లను లైఫ్‌లైక్ టెక్స్చర్‌తో ఇంటరాక్టివ్‌గా మార్చడం ద్వారా ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫాబ్రిక్ ఫీల్ చేయడం, వర్చువల్ ఆబ్జెక్ట్‌లను టచ్ చేయడం వంటి అనుభవాలు, అనుభూతులు సాధ్యమవుతాయి. ఇది డిజిటల్ టచ్‌ను మరింత రియలిస్టిక్‌గా మార్చి మనిషి-పరికరం మధ్య ఇంటరాక్షన్‌ను మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.






