- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔషధాలను కనుగొంటున్న ఏఐ సిస్టమ్స్.. చికిత్సలను వేగవంతం చేయడంలోనూ సహాయం!
ఏఐ వ్యవస్థలు ఇప్పుడు కొత్త మందులను కనుగొంటున్నాయి. బయోలాజికల్ & కెమికల్ డేటా సెట్‌లపై శిక్షణ పొందిన అధునాతన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉపయోగించి, మెడిసిన్ అభ్యర్థనలను విశ్లేషిస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : పెరుగుతున్న రోగాలకు, అవసరాలకు అనుగుణంగా కొత్త మెడిసిన్స్ కనుగొనాలంటే ఒకప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు పట్టేది. బిలియన్ల డాలర్లు అందుకోసం ఖర్చయ్యేది. పైగా ఇది ఎక్కువ శ్రమతో కూడిన పనిగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతికత వల్ల ఇప్పుడా పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందంటన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే కేవలం కొన్ని రోజుల్లోనే కొత్త మందులను కనుగొనలిగే ఏఐ సిస్టమ్స్‌ను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT)కి చెందిన నిపుణులు అభివృద్ధి చేశారు. వీరు 2025లోనే జనరేటివ్ ఏఐతో కొత్త యాంటీ బయాటిక్స్ డిజైన్ చేసి, డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను చంపే కాంపౌండ్స్‌ను కనుగొన్నారు. వీరితోపాటు ఇతర శాస్త్రవేత్తలు సైతం ఏఐ వ్యవస్థలను డెవలప్ చేస్తున్నారు.
సాంకేతిక వ్యవస్థలతో..
సాంకేతిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఏఐ వ్యవస్థలు ఇప్పుడు కొత్త మందులను కనుగొనడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇవి బయోలాజికల్ & కెమికల్ డేటా సెట్‌లపై శిక్షణ పొందిన అధునాతన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉపయోగించి మిలియన్ల సంఖ్యలో మెడిసిన్స్ అభ్యర్థనలను విశ్లేషిస్తాయి. వాటి ప్రోటీన్‌లతో అవి ఎలా సంకర్షణ చేస్తాయో ఊహించి, ఏవి ఉత్తమమైనవో కూడా గుర్తిస్తాయి. ఈ ప్రక్రియ కోసం ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు పట్టేది. కానీ ఏఐ పుణ్యమా అని ఇప్పుడు కేవలం రోజులలో కొత్త మెడిసిన్స్‌ను శాస్త్రవేత్తలు డెవలప్ చేయగలుగుతున్నారు. ఇటీవలి పురోగతుల ప్రకారం ఏఐ (AI) సహాయంతో మందులు-నిరోధక బ్యాక్టీరియాలను (Drug-resistant) కొత్త యాంటీ బయాటిక్స్ కనుగొన్నారు. ఇది క్యాన్సర్ సహా పలు ఇతర నివారణలేని అరుదైన వ్యాధులకు చికిత్సల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. భవిష్యత్తులో మందుల అభివృద్ధి కేవలం ల్యాబ్‌లలో మాత్రమే కాకుండా శక్తివంతమైన ఏ సాంకేతిక వ్యవస్థలలోనూ జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఎలా పనిచేస్తాయి?
బయోలాజికల్+కెమికల్ డేటా సెట్‌లపై శిక్షణ పొందిన జనరేటివ్ ఏఐ ( ఉదా: Deep Learning, AlphaFold స్టైల్) మిలియన్ల మాలిక్యూల్స్‌ను సృష్టించి, ప్రోటీన్ టార్గెట్‌తో ఎలా బంధం ఏర్పడుతుందో, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అని ఊహిస్తాయి. ఇప్పటి వరకు ఈ ఏఐ సిస్టమ్స్ పలు మెడిసిన్స్‌ను కనుగొన్నాయి. కూడా ముఖ్యంగా డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియాలకు కొత్త యాంటీబయాటిక్స్ (Halicin, Abaucin, SyntheMol compounds), క్యాన్సర్, రేర్ డిసీజెస్‌కు కొత్త టార్గెట్ డ్రగ్స్‌ను గుర్తించి, డెవలప్ చేయడంలో సహాయపడ్డాయి. ఏఐ డిజైన్ చేసిన మందులు కొన్ని ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌లో కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.






