సర్జరీ లేకుండానే బ్రెయిన్‌కు ఆపరేషన్.. భారత సైంటిస్ట్‌ అద్భుతం!

by B.Srinivas |

సర్జరీ లేకుండానే బ్రెయిన్‌కు ఆపరేషన్ చేసే ‘Injectable electronic chip’ అనే డివైజ్‌ను సైంటిస్ట్‌ తయారుచేశారు.

సర్జరీ లేకుండానే బ్రెయిన్‌కు ఆపరేషన్.. భారత సైంటిస్ట్‌ అద్భుతం!
X

దిశ, ఫీచర్స్: వైద్యరంగంలో మరో అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మనుషులకు ఎలాంటి పెయిన్స్ లేకుండా సర్జరీలు చేసే సరికొత్త ఆపరేషన్ పరికరాలను తయారుచేస్తున్న వైద్యులు.. తాజాగా అతిసున్నితమైన బ్రెయిన్‌కు ఎలాంటి కోత లేకుండా చికిత్స చేసే డివైజ్ తయారు చేశారు. ఈ మేరకు భారతీయ సంతతికి చెందిన MIT శాస్త్రవేత్త డాక్టర్ డెబ్లినా సర్కార్.. ‘Injectable electronic chip’ అనే పరికరాన్ని స్వయంగా డెవలప్ చేయగా ప్రయోగాల్లో సక్సెస్ అయింది.

రైస్ కంటే చిన్నగా..
బియ్యం గింజ కంటే బిలియన్ రెట్లు చిన్నగా ఉండే ఈ ఎలక్ట్రానిక్ చిప్‌.. ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే చికిత్స పూర్తిచేయనుంది. ‘సర్క్యులాట్రోనిక్స్’ అని పిలవబడే ప్రక్రియలో ఈ అతిచిన్న వైర్‌లెస్ పరికరం రక్త నాళాల్లో స్వేచ్ఛగా కదలుంది. బాడీలోని రక్తంతోపాటు మెదడుకు ప్రయాణించి నిర్ధేశించిన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డెబ్లినా తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయవచ్చంటున్నారు. అంతేకాదు ఈ చిప్ శరీరంలోకి రోగనిరోధకశక్తి కణాలను మోసుకెళ్లగలదని, ఫిక్స్ చేసిన టార్గెట్ చేరుకోగానే బయటనుంచి పంపిచే సిగ్నల్స్ ఆధారంగా చికిత్స ప్రారంభిస్తుందని శాస్త్రవేత్త బెబ్లినా వెల్లడించారు.

‘ఈ వైర్‌లెస్‌ ఎలక్ట్రానిక్ చిప్‌.. అల్జీమర్స్, మల్టిపుల్ స్ల్కేరోసిస్, మెదడులోని కణితులు, దీర్ఘకాలిక పెయిన్స్, ఇతర నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. జంతువులపై చేసిన పరీక్షలు ఆశాజనకమైన ఫలితాలను అందించాయి. ఈ సాంకేతికత భవిష్యత్తులో non-invasive బ్రెయిన్ ట్రీట్మెంట్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు.

Next Story