- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని రకాల క్యాన్సర్ల నివారణకు ఒకే ఒక వ్యాక్సిన్..! ఫ్లోరిడా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ..
అన్ని రకాల క్యాన్సర్ల నివారణకు ఒకే ఒక వ్యాక్సిన్..! ఫ్లోరిడా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ..

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్లు బహు రకాలు.. శరీరంలో అది వచ్చిన ప్లేస్‌ను బట్టి కూడా ప్రత్యేక చికిత్సలు అవసరం. అంటే స్కిన్ క్యాన్సర్‌కు ఒక విధమైన ట్రీట్మెంట్ అవసరమైతే.. చెస్ట్ క్యాన్సర్‌కు మరో పద్ధతిలో చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్లోరిడా యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు ఒక అద్భుత ఆవిష్కరణకు తెరతీశారు. అన్ని రకాల క్యాన్సర్లతో పోరాడేందు సహాయపడే ఒకే ఒక వినూత్నమైన వ్యాక్సిన్‌ను డెవలప్ చేశారు. అదే.. mRNA క్యాన్సర్ వ్యాక్సిన్.
నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ జర్నల్‌లో పబ్లిషైన వివరాల ప్రకారం.. ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు అభివృద్ధి చేసిన mRNA క్యాన్సర్ టీకా. ఆ మహమ్మారి నివారణకు సులువైన, సమర్థవంతమైన పరిష్కారం. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, స్కిన్, చెస్ట్, ప్రొస్టేట్, థ్రోట్ ఇలా.. వివిధ రకాల క్యాన్సర్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ టీకా వైరల్ సంక్రమణను అనుకరిస్తూ రోగ నిరోధక కణాలను, కణితులను గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా నిరోధించడంలో సహాయపడుతుందని, వ్యాక్సిన్ అభివృద్ధిలో కీ రోల్ పోషించి పరిశోధకులు డాక్టర్ ఎలియాస్ సయ్యూర్, డాక్టర్ డుయాన్ మిచెల్ పేర్కొన్నారు.
అన్ని రకాల క్యాన్సర్ మహమ్మారుల నివారణకు ఒకే రకమైన వ్యాక్సిన్‌ను కనుగొనే పరిశోధనలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి శాస్త్రవేత్తలు దీనిపై మరింత ఫోకస్ చేసి, రీసెంట్‌గా విజయం సాధించారు. అయితే కొత్తగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తొలుత ఎలుకలపై నిర్వహించిన అధ్యయనాల్లో అద్భుతమైన ఫలితాలను చూపింది. ప్రస్తుతం ఇది మానవులపై ప్రయోగాలకు మాత్రమే సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా సక్సెస్ అయితే.. క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది మరెంతో దూరంలో లేకపోవచ్చు. Link






