స్కూల్ పిల్లల శృంగార అనుభవాలపై సర్వే.. దుమారం రేపుతున్న రిపోర్ట్

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-05 15:22:10  IST  )

స్కూల్ పిల్లల సెక్స్ ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన సర్వే స్కాట్లాండ్‌లో దుమారం రేపుతోంది. 2021లో నిర్వహించిన సర్వేలో 14ఏళ్లలోపు పిల్లల లైంగిక అనుభవాల గురించి తెలుసుకుంది. దాదాపు లక్షా 30వేల మంది పిల్లలు తమ

స్కూల్ పిల్లల శృంగార అనుభవాలపై సర్వే.. దుమారం రేపుతున్న రిపోర్ట్
X

దిశ, ఫీచర్స్ : స్కూల్ పిల్లల సెక్స్ ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన సర్వే స్కాట్లాండ్‌లో దుమారం రేపుతోంది. 2021లో నిర్వహించిన సర్వేలో 14ఏళ్ల పిల్లల లైంగిక అనుభవాల గురించి తెలుసుకుంది అక్కడి ప్రభుత్వం. దాదాపు లక్షా 30వేల మంది పిల్లలు తమ డేటాను షేర్ చేసుకున్నారు. అయితే అప్పుడే వివాదాస్పదంగా మారిన ఈ సర్వే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. కారణం ఈ డేటాను ఎక్స్‌టర్నల్ రీసెర్చ్ కోసం అందించడమే.

నిజానికి సర్వేలో లైంగిక సంబంధాల గురించి తమ పిల్లలను ప్రశ్నలు అడుగుతారని ముందుగా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ఇలా ఎందుకు చేశారని అడిగితే కేవలం హెల్త్ అండ్ వెల్‌నెస్ పర్పస్‌లోనే వివరాలు సేకరించామని, ఈ డేటా థర్డ్ పార్టీకి షేర్ చేయబడదని వివరించారు అధికారులు. ఇన్నాళ్లు ఈ డేటా స్కాట్లాండ్ రీసెర్చ్ వెబ్‌సైట్ అధీనంలో ఉండగా.. ప్రస్తుతం పబ్లిక్‌గానే రీసెర్చర్స్‌కు అందించారు. ఈ క్రమంలో తమ పిల్లలకు సంబంధించిన సెక్స్ ఎక్స్‌పీరియన్స్ డేటా బయటకు వచ్చే చాన్స్ ఉందని పేరెంట్స్ భయపడుతున్నారు. అయితే స్కాటిష్ గవర్నమెంట్ స్పోక్స్‌పర్సన్ ఈ సమాచారం స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ పర్పస్‌లోనే వినియోగించబడుతుందని.. దీని నుంచి విద్యార్థులను ఐడెంటిఫై చేసే చాన్స్ లేదని చెప్పుకొచ్చారు. కానీ యూకే గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా ఇలాంటి డేటా సేకరించడంపై పలు సంస్థలు మండిపడుతున్నాయి.

Next Story