- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బటర్ చికెన్ బ్రాండ్ అంబాసిడర్.. పని చిన్నదే.. కల చాలాపెద్దది.!
ఇప్పుడు ప్రపంచమంతా మెచ్చే బటర్ చికెన్‌కి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు

దిశ, ఫీచర్స్: వంట అంటే మనకు మహిళలే గుర్తుకొస్తారు. పుసుక్కున ఎవరైనా అబ్బాయిలు వంటింటట్లోకి వస్తే.. ఇక్కడ నీకేం పనిరా అంటూ తన్ని తరిమేస్తారు. కానీ ఆ నిబంధనలేవీ లేని శాకాహారం ఇంట్లో పుట్టిన సరంశ్ గోయిలా.. ఇప్పుడు ప్రపంచమంతా మెచ్చే బటర్ చికెన్‌కి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. మనకొక సక్సెస్ స్టోరీ అయ్యాడు.
12 ఏళ్లకే వంటగదిలోకి..
సరంశ్ గోయిలా ఇప్పుడు దేశమంతా తెలిసిన పేరు. కానీ ఆ పేరు వెనక కూడా ఒక చిన్న కథ ఉంది. 1984లో వచ్చిన ‘సారాంశ్’ సినిమా పేరు మీదుగా సరంశ్‌కి ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు. మన ఇళ్లలో అబ్బాయిలు వంటగదిలోకి రావద్దనే నియమం ఉన్నట్లు సరంశ్‌కు లేకుండె. వాళ్ల తాతనే ఆదివారం వస్తే కిచెన్లోకి దూరి వంట చేసేవారట. పాత హల్ద్వానీ రెసిపీలు చేయడం ఆయనో స్పెషలట. అలాగే చిన్నప్పుడు సరంశ్ టీవీలో సంజీవ్ కపూర్ ‘ఖానా ఖజానా’ షో చూసేవాడు. ఇంట్లో తాత.. టీవీలో సంజీవ్ కపూర్ ఇద్దరూ పురుషులు వంట చేస్తుండగా చూసి అతడికీ ఆసక్తి ఏర్పడింది. వాళ్లమ్మ కూడా ఎప్పుడూ ‘వంట ఎందుకు నేర్చుకుంటున్నావు’ అని అనలేదు. అలా 12 ఏళ్లకే వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చాడు సరంశ్.
ఇంటర్నేషనల్ లెవెల్‌లో..
స్కూల్ రోజుల్లో సరంశ్‌కు థియేటర్ మీద ఎక్కువ ఇష్టం. కానీ కెరీర్ ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులు రెండే రెండు ఆప్షన్లు పెట్టారు. అవి.. బయోటెక్నాలజీ లేదా కుకింగ్. తాత సలహాతో కుకింగ్ ఎంచుకున్నాడు. ఔరంగాబాద్ ఐహెచ్ఎం నుంచి కులీనరీ ఆర్ట్స్ పూర్తిచేసి లీలా హోటల్‌లో పని మొదలుపెట్టాడు. కానీ కిచెన్‌లో గంటల తరబడి పని తట్టుకోలేక బయటకు వచ్చేశాడు. వాళ్లది వెజిటేరియన్ ఫ్యామిలీ. సింధీ సాయి భాజీ.. ఆలూ టుక్.. సింధీ కఢీ ఇవే అతని కంఫర్ట్ ఫుడ్. అలాంటివాడికి బటర్ చికెన్ ఎలా ఐడెంటిటీ అయింది? అని అడిగితే ‘పూర్తిగా అదృష్టం’ అంటాడు సరంశ్. ఇప్పుడు గోయిలా బటర్ చికెన్ అంటే ఢిల్లీ.. ముంబయితో పాటు టాప్ సిటీస్‌లో ఉండే జనం పిచ్చెక్కిపోతారు. దానికి ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపు ఉంది.
డేవిడ్ బెక్‌హామ్‌కి రుచి..
ఒకప్పుడు టీవీలో చూసి ఆరాధించిన సంజీవ్ కపూర్‌తో 24 ఏళ్లకే కలిసి మాట్లాడాడు. తన చేత్తో రాసిన రెసిపీ బుక్ ఇచ్చాడు. ‘నేను యంగ్ ఏజ్ లో ఉన్నట్టే ఉన్నావ్ అచ్చం’ అని సంజీవ్ కపూర్ మాటలు జీవితాంతం ఎప్పుడూ గుర్తుచేసుకుంటాడు. ఇటీవల ఇంస్టాగ్రామ్ క్రియేటర్స్ ఈవెంట్‌లో డేవిడ్ బెక్‌హామ్‌ని కలిశాడు. తన బటర్ చికెన్ తినిపించాడు. ఢిల్లీలో పుట్టి పెరిగినా ఇప్పుడు ముంబయే నా ఇల్లు అని చెప్పుకుంటాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడు బటర్ చికెన్‌కే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడంటే అదంత ఆశామాషీ వ్యవహారం కాదంటారు తెలిసినవాళ్లు. ఇంకా తాత చెప్పిన వంటల్ని చూస్తూ నేర్చుకున్న ఒక సాధారణ వ్యక్తి డేవిడ్ బెక్‌హామ్‌కి బటర్ చికెన్ తినిపించిన చెఫ్ వరకు ఎదగడమంటే మాటలు కాదు.






