- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరూ ఐటీ ఉద్యోగాలు చేస్తుంటే ఈ అమ్మాయి మాత్రం ఆటో డ్రైవర్ కావాలనుకుంది.. ఎందుకో తెలుసా.?
స్కూటీ నుంచి సొంత ఈ-ఆటో డ్రైవర్‌గా మారేలా చేసింది

దిశ, ఫీచర్స్: బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు, కార్పొరేట్ జీవితం కోసం పరుగెత్తే యువత మధ్య 29 ఏళ్ల సఫూరా ఖాన్ భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. చాలామంది డ్రైవింగ్‌ను ఆఖరి ఎంపికగా చూస్తుంటే.. సఫూరా మాత్రం అందులో ఆనందాన్ని చూసింది. స్కూటీ నుంచి సొంత ఈ-ఆటో డ్రైవర్‌గా మారేలా చేసింది.
స్కూటీ నుంచి ఆటో వరకు..
సఫూరా కర్ణాటకలోని ఒక సాధారణ కుటుంబంలో పెరిగింది. తల్లిదండ్రులు చెన్నయ్ నుంచి కర్ణాటకకు వలస వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆమెకు ప్రధాన ప్రాధాన్యత కాలేదు. అయితే చిన్నప్పటి నుంచి ఆమెకు టూ-వీలర్లపై మోజు. 2020 నాటికి తన సొంత సేవింగ్స్‌తో సీటీ100 బైక్ కొనుక్కున్నది. అయితే ఆమె డ్రైవింగ్‌ను వృత్తిగా మార్చుకోవాలనుకుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచిస్తుంటే మరోవైపు తల్లి వారించి ససేమిరా అన్నది. కానీ బిడ్డ ఆసక్తిని లోతుగా గమనించి తర్వాత ఒప్పుకుంది. దీంతో సఫూరా జీవితంలో కొత్త అధ్యాయానికి తలుపులు తెరిచినట్లయింది.
ఉదయం 5 గంటలకే..
సొంత ఆటో కొనే ముందు సఫూరా షెల్ పెట్రోల్ పంప్‌లో, హోమ్ నర్సింగ్‌లో, స్విగ్గీ, అమెజాన్‌లకు పార్సెల్స్ డెలివరీ వంటి రకరకాల ఉద్యోగాలు చేసింది. ఇవికూడా కష్టమైనవే. కానీ వాటిని ఆమె అనుభవాలుగా భావించింది. ఏ పని చేసినా దాన్ని ఆనందించాలనుకునే మనస్తత్వం ఆమెది. డబ్బు మాత్రమే జీవితాన్ని సంతోషపెట్టలేదనేది తన ఫిలాసఫీ. లోన్ తీసి ఒక ఈ-ఆటో కొనుగోలు చేసింది. తన జర్నీ ఉదయం 5 గంటలకు మొదలై.. రాత్రి 9 వరకు కొనసాగుతుంది. మధ్యలో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ తన చిన్న తమ్ముడికి ట్యూషన్ కూడా చెప్పుతుంది.
వీడియో వైరలై..
రాత్రి వేళల్లో డ్రైవింగ్ మహిళలకు సురక్షితం కాదని చాలామంది భావిస్తారు. కానీ సఫూరా దీన్ని ఖండిస్తుంది. తన ఆత్మవిశ్వాసం, ప్రశాంతత రాత్రుల్లోనూ సురక్షితంగా డ్రైవింగ్ చేసేందుకు సహకరించాయి. ఒకరోజు డిజిటల్ క్రియేటర్ తమన్నా తన్వీర్ సఫూరాతో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో 2.8 మిలియన్ వీక్షణలు, 3,000పైగా కామెంట్లతో వైరలైంది. ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్టార్టప్ 'గెట్టెకార్' సఫూరాకు కారు అందించేందుకు ముందుకొచ్చింది. వాస్తవానికి తమన్నా వ్లాగర్ అని తనకు తెలియదు. అకస్మాత్తుగా అభినందనలు చెప్పడంతో ఆమె ఖుషీ అయ్యింది.
డ్రైవింగ్‌లోనే కొనసాగి..
ఈ కొత్త గుర్తింపు ఆమెకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది. రోజూ ఉదయం 5 గంటలకు లేచి 6 గంటలకు తన రోజును మొదలుపెట్టి, రెండు షిఫ్ట్‌లలో పని చేస్తుంది. ఒక యూట్యూబ్ ఛానల్‌ను కూడా నడుపుతుంది. మహిళా డ్రైవర్‌గా సఫూరా స్టీరియోటైప్‌లను ఎదుర్కొంది. విమర్శలు.. సందేహాలను వేటినీ పట్టించుకోలేదు. రెట్టించిన ఉత్సాహంతో తన పని తాను చేసుకుంటోంది. అయితే తకొక కల ఉంది. ఐదేళ్లలో సొంత ఇల్లు కొనడం. ప్రస్తుతం దానికోసం శ్రమిస్తోంది. డ్రైవింగ్‌లోనే కొనసాగి సాధికారత సాధిస్తా అని గర్వంగా చెప్తోంది.






