- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aalim Hakim: హెయిర్ కటింగ్‌కు రూ.లక్ష.. ఎందుకంతా కాస్ల్టీ అంటే?
మాములుగా సెలూన్‌కి (Saloon) వెళ్లి హెయిర్ కట్ (Hair cut) చేయించుకుంటే వంద, రెండొందలు ఖర్చవుతుంది.

దిశ, వెబ్ డెస్క్: మాములుగా సెలూన్‌కి (Saloon) వెళ్లి హెయిర్ కట్ (Hair cut) చేయించుకుంటే వంద, రెండొందలు ఖర్చవుతుంది. కాస్తా లగ్జరీ సెలూన్లలో అయితే వెయ్యి వరకు ఉంటుంది. కానీ, ఈ బార్బర్ కత్తెర పెడితే చాలు లక్ష రూపాయలు కట్టాల్సిందే!. అంత కాస్ల్టీ బార్బర్ (Barber) ఎవరని ఆలోచిస్తున్నారా? అతడే ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హాకీమ్ (Aalim Hakim). ఇతడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీల హెయిర్ డ్రెస్సర్‌గా, ఇండియాలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బార్బర్‌గా ఎంతో ఫేమస్ అయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, అలాగే మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, యుజువేంద్ర చాహల్ తదతర క్రికెట్ స్టార్లందూ ఇతడి కస్టమర్లే.
అయితే, ఆలీమ్ ఇంత గొప్ప స్థానాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఆలీమ్ తండ్రి దివంగత హకీమ్ కైరన్వీ.. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, శశికపూర్‌లతో పాటు అప్పట్లో చాలా మంది సెలబ్రెటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసేవారు. ఆలీమ్ 9 ఏళ్ల వయసున్నప్పుడు కైరన్వీ మృతిచెందాడు. ఫ్యామిలీ రోడ్డున పడటంతో తండ్రి స్థాపించిన వారసత్వాన్ని ఆలీమ్ ముందుకు తీసుకెళ్లాలని భావించారు. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 మాత్రమే తీసునేవాడు. అలాగే, హెయిర్ కటింగ్, షాంపూతో క్లీన్ చేయడానికి రూ.30 తీసుకునేవాడు. తన పనితనం బాగుండడంతో రోజు రోజుకీ కస్టమర్లు పెరిగిపోయారు. 1990లో ఆలీమ్‌కు మంచి గుర్తింపు లభించింది. చాలామంది సెలబ్రిటీలు రావటం ప్రారంభించారు. దీంతో ఫీజు అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయాడు. ప్రస్తుతం ఆలీమ్ హకీమ్ ఒక్కో హెయిర్ కటింగ్‌కు రూ.లక్ష నుంచి అత్యధికంగా రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. అంతేకాదు, ఆలిమ్ పలు సినిమాలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తున్నారు.






