- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్రంపై సవాల్.. మర్చెంట్ నేవీలో మహిళా ఆఫీసర్.!
కార్నివాల్ యూకే క్రూయిజ్ కంపెనీలో పనిచేస్తోంది రోమిటా రోజీ బుండేలా

దిశ, ఫీచర్స్: మర్చెంట్ నేవీ.. పురుషాధిపత్యం ఉన్న రంగం. దీంట్లోకి మహిళలు వెళ్లాలంటే చాలా కష్టం. ఇక నిలదొక్కుకోవడం అంటారా.? దాని గురించి పెద్ద అంచనాలు పెట్టుకోవద్దు. అలాంటి కష్టతరమైన రంగాన్ని ఎంచుకొని పురుషాధిపత్యానికి బ్రేకులు వేసి డెన్మార్క్ షిప్పింగ్ కంపెనీ మేర్క్స్‌లో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం కార్నివాల్ యూకే క్రూయిజ్ కంపెనీలో పనిచేస్తోంది రోమిటా రోజీ బుండేలా.
నేవీలో చేరాలనే కల..
రోమిటాది మహారాష్ట్రలోని భుసావాల్. 29 సంవత్సరాల వయసున్న రోమిటా సముద్ర జీవితం పట్ల ఆకర్షితురాలై మర్చెంట్ నేవీలో అడుగుపెట్టింది. పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలో ఒంటరిగా 20 మంది మగవాళ్ల మధ్య పనిచేస్తూ.. ఎన్నో వివక్షలు ఎదుర్కొంది. ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్‌గా ప్రారంభమైన తన ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగింది. చిన్నప్పటి నుంచి ఇండియన్ నేవీలో చేరాలని కలలు కన్న రోమిటా.. అది సాధ్యం కాకపోయేసరికి సముద్రంపై ప్రపంచాన్ని చుట్టేయాలనే కలగని మర్చెంట్ నేవీని ఎంచుకుంది. ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన రోమిటా షిప్పింగ్ కార్పొరేషన ఆఫ్ ఇండియాలో ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది.
మొదటి మహిళా క్యాడెట్..
ఐతే.. ఆ బ్యాచ్ రద్దవడంతో గూగుల్ సాయంతో పుణెలోని ఇనిస్టిట్యూట్లో చేరింది. 40 మంది విద్యార్థుల్లో ఆమె ఒక్కరే అమ్మాయి. ఆ ఇనిస్టిట్యూట్లోనే మొదటి మహిళా క్యాడెట్. నాలుగు నెలల కాలేజీ శిక్షణ.. ఎనిమిది నెలల సముద్ర శిక్షణ పూర్తిచేసుకొని 2017లో మేర్క్స్ కంపెనీలో ఇండియా నుంచి మొదటి మహిళా ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరింది. షిప్‌లోని అన్ని ఎలక్ట్రికల సిస్టమ్స్, ఆటోమేషన్, రిఫ్రిజరేషన్, లైటింగ్ వంటివి నిర్వహించడం ఆమె డ్యూటీ. షిప్‌లో అడుగుపెట్టగానే "ఇక్కడేం చేస్తున్నావు? ఈ ఉద్యోగం నీకు సూట్ అవదు.. ఇంటికి వెళ్లిపో" అని అంటూ ఉన్నతాధికారులు వివక్ష చూపించేవాళ్లు. 20 మంది పురుషుల మధ్య రోమిటా ఒక్కరే అమ్మాయి.
మహిళా సూపరిండెంట్..
వివక్ష వల్ల ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం ద్వారానే వాళ్ల నోర్లు మూయించాలి అనుకునేది. పైకి బాగనే మాట్లాడుతున్నా లోలోపల ఆమెను చూసి అసూయపడేవాళ్లు. నాలుగు నెలలు ఆ వివక్షను ఎదుర్కొని తన పనితో అందరినీ మెప్పించింది. అలా ప్రతీ సవాలును స్వీకరించి నాలుగేళ్లలోనే ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్‌గా ప్రమోట్ అయ్యింది. 26 ఏళ్లకే మొదటి మహిళా సూపరింటెండెంట్‌గా 64 షిప్‌లను నిర్వహించింది. 2023లో కార్నివాల్ యుకేలో చేరింది. ప్రస్తుతం బ్రిటానియా క్రూయిజ్ షిప్‌పై సెకండ్ ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. నార్వేజియన్, బాల్టిక్, కరీబియన్ క్రూయిజ్‌లలో పాల్గొని బార్బడోస్, ఆంటిగ్వా, మిడిల్ ఈస్ట్, యూరప్ వంటి ప్రాంతాలు సందర్శించిన రోమిటా 65 దేశాల సిబ్బందితో కలిసి పనిచేస్తోంది.






