బ్రేకప్‌కు కారణమవుతున్న ‘లాయల్టీ టెస్టర్స్’.. టెస్ట్ చేయమంటే రొమాన్స్ చేస్తున్నారు..

by Bhoopathi Nagaiah |

లాయల్టీ టెస్టర్స్’ (Loyalty testers) అనే మాట ఎప్పుడైనా విన్నారా..? వారేం చేస్తారో తెలుసా? ఎందుకంటే ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది.

బ్రేకప్‌కు కారణమవుతున్న ‘లాయల్టీ టెస్టర్స్’.. టెస్ట్ చేయమంటే రొమాన్స్ చేస్తున్నారు..
X

దిశ, ఫీచర్స్ : ‘లాయల్టీ టెస్టర్స్’ (Loyalty testers) అనే మాట ఎప్పుడైనా విన్నారా..? వారేం చేస్తారో తెలుసా? ఎందుకంటే ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది వియత్నాంలో అత్యధికంగా ట్రెండింగ్‌లో ఉన్న సర్వీస్ ఇదేనట. ఒక వ్యక్తి తన శృంగార భాగస్వామిపై నమ్మకం లేనప్పుడు ఆమె/అతని గురించి తనకు తెలియని రహస్యాలు, రొమాంటిక్ సంబంధాలు, మోసం వంటి అంశాలను తెలుసుకోవడానికి నేరుగా కాకుండా, ఆన్‌లైన్ కేంద్రంగా సేవలందించే మూడో వ్యక్తి అయిన ‘లాయల్టర్’(loyalter)ను సంప్రదిస్తారు. వీరు క్లయింట్లకు సంబంధించిన ఆయా వ్యక్తులను, వారి భాగస్వాములను మాటల్లో పెట్టి వారి పర్సనల్ విషయాలు తెలుసుకొని టార్గెటెడ్ వ్యక్తులకు తెలియజేస్తారు. ఈ విధమైన సేవ ప్రస్తుతం ‘లాయల్టీ సర్వీసెస్’ (Loyalty Services) పేరుతో ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. అనేక దేశాల్లో ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్‌లో దీనికి డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇటీవల ఈ సేవలపై పలువురిలో విముఖత కూడా వ్యక్తం అవుతోంది. కారణం అది సంబంధాలను విచ్ఛిన్నం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

తమ భాగస్వాములపై నమ్మకం లేని వ్యక్తులు మాత్రమే ఎక్కువగా ‘లాయల్టీ టెస్టింగ్’ సర్వీసెస్‌ను యూజ్ చేసుకుంటారు. ఈ క్రమంలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సేవలో భాగంగా ఒక వ్యక్తి మరో వ్యక్తి పార్ట్‌నర్‌తో ఆన్‌లైన్ కేంద్రంగా మాట్లాడతాడు. దీనివల్ల సదరు వ్యక్తితో లాయల్టీ టెస్టర్‌కు సంబంధాలు కూడా ఏర్పడుతుండటంవల్ల పలువురు తమ నిజమైన భాగస్వామిని పూర్తిగా వదులుకునే అవకాశాలకు దారితీస్తోందని సైకాలజిస్టులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు వియత్నాంలో జరిగాయని చెప్తున్నారు. ఒక సింపుల్ సెర్చ్‌, టెస్టులకు వేలల్లో చెల్లింపులు ఉండటంవల్ల ఈ సేవలను అందించే వారు లాభపడుతుండగా, సేవలు పొందే పేరుతో అనేక మంది నష్టపోతున్నారు. తమ రొమాంటిక్ పార్టనర్స్‌తో విడాకులు తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఫేస్‌బుక్‌లో కూడా ఇటువంటి సేవలు వందల సంఖ్యలో ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. సగానికి పైగా ఉచిత సేవలు కూడా ఉన్నాయని ఈ టైప్ ఆఫ్ పార్టనర్ లాయల్టీ టెస్టింగ్స్ వాస్తవ సంబంధాలపై ఊహించలేని నెగెటివ్ పరిణామాలకు దారితీస్తున్నాయని హనోయికి చెందిన సైకాలజిస్ట్ ట్రాన్ హువాంగ్ థావో అంటున్నారు.

Next Story