- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : అందుబాటులోకి రోబో ఎలక్ట్రీషియన్లు..! ప్రమాదకర పనుల్లో తొలగనున్న ముప్పు
విద్యుత్ రంగంలో మానవులకు బదులుగా ఎలక్ట్రీషియన్ రోబోలను ఉపయోగించేందుకు సాంకేతిక శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోబో టెక్నాలజీ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : ఏఐ ఆధారిత రోబోటిక్ టెక్నాలజీ ఇప్పటికే అద్భుతాలు చేస్తోంది. వివిధ రంగాల్లో రోబోలను ఉపయోగించడం ద్వారా మానవ శ్రమ తగ్గి, సౌకర్యాలు, ప్రొడక్టివిటీ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యుత్ రంగంలో హానికరమైన ఎలక్ట్రికల్ వర్క్‌లో రోబోలను ఉపయోగించుకోవడంపై సాంకేతిక శాస్త్రవేత్తలు చాలా కాలంగా పనిచేస్తున్నారు. రీసెంట్‌గా ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా చైనాలో రోబో ఎలక్ట్రీషియన్ 10 kV పవర్ లైన్ మరమ్మతులు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. దీనిని హుబీ ఎలక్ట్రిక్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్& వూహాన్ స్టేట్ గ్రిడ్ కలిసి డెవలప్ చేశాయి. ప్రజెంట్ ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విద్యుత్ రంగంలో రోబోల పనితీరు, భవిష్యత్తు గురించి పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రాణహాని లేకుండా..
ప్రపంచ వ్యాప్తంగా రోబో ఎలక్ట్రీషియన్లు అందుబాటులోకి వస్తే విద్యుత్ నిర్వహణ పనుల్లో మానవులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పటికే చైనాలో ఉపయోగిస్తున్న రోబోలను బట్టి చూస్తే దీనిపై మరింత నమ్మకం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇవి ఏఐ కెమెరాలు, LiDAR, లేజర్ టూల్స్, రోబోటిక్ ఆర్మ్స్ & సెన్సార్లతో పని చేస్తాయి. ఇటీవల హుబీ ఎలక్ట్రిక్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్& వూహాన్ స్టేట్ గ్రిడ్ కలిసి డెవలప్ చేసిన రోబోలు స్వయంగా లేజర్ కటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇన్సులేషన్‌ను కచ్చితంగా తొలగించి, బ్రాంచ్‌వైర్‌ను మెయిన్ వైర్‌తో క్లాంప్ చేసి, కనెక్షన్లను టైట్ చేయడం వంటి పనుల్లో అచ్చం మానవుల్లాగే ప్రతిభ కనబరుస్తున్నాయి. ఇవి10kV లైవ్ వైర్ల మరమ్మతులు చేయడంతో మనుషులకు ప్రాణహాని తప్పుతున్నది.
పనితీరు అద్భుతం..
నిజానికి ఈ 10 kV లైవ్ వైర్ల మరమ్మతుల్లో మానవ ఎలక్ట్రీషియన్లు పనిచేయడం చాలా రిస్క్‌తో కూడినది. స్పెషల్ ప్రొటెక్టివ్ గేర్ ధరించి పనిచేస్తుంటారు. అయినప్పటికీ ఏ చిన్న తప్పు జరిగినా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ రోబోలు ఆ పనిచేసినప్పుడు మానవులకు ప్రాణహాని సమస్య తప్పుతుంది. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ లేదా లైవ్-లైన్ రోబోలు హై-వోల్టేజ్ పవర్‌లైన్లు, సబ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మరమ్మతు, ఇన్‌స్పెక్షన్&నిర్వహణ కోసం రూపొందించడతాయి. విద్యుత్ సరఫరాను ఆపేయకుండానే ఇవి పనిచేయగలవు.
అందుబాటులో ఉన్నాయా?
ప్రస్తుతం చైనాలో 8,500 ఎలక్ట్రీషియన్ రోబోట్లు గ్రిడ్ మెయింటెన్స్‌లో ఉపయోగించేందుకు అక్కడి సాంకేతిక శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోబో ఎలక్ట్రీషియన్ రోబోలు విస్తరించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. జపాన్, అమెరికా, యూరప్‌లలో కూడా ఇన్‌స్పెక్షన్ రోబోలు టెస్టింగ్/డిప్లాయ్‌మెంట్ దశలో ఉన్నాయి. పూర్తి మరమ్మతు రోబోలు డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే పూర్తి ఎలక్ట్రీషియన్ రోబోలైతే ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. కానీ ఐఐటీ కాన్పూర్& పవర్ గ్రిడ్ కలిసి సబ్‌స్టేషన్ ఇన్‌స్పెక్షన్ రోబోను అభివృద్ధి చేశారు. అంటే భవిష్యత్తులో ఎలక్ట్రీషియన్ రోబోలు ఇక్కడ కూడా వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. అదే జరిగితే విద్యుత్ రంగంలో పవర్ లైన్ల ఇన్‌స్పెక్షన్ & ఫాల్ట్ డిటెక్షన్, సబ్‌స్టేషన్ మానిటరింగ్&కండిషన్ అసెస్మెంట్ వంటివన్నీ రోబో ఎలక్ట్రీషియన్లే పూర్తిచేసే చాన్స్ ఉంటుంది.
ప్రయోజనాలు
*ఎలక్ట్రిక్ షాక్‌లకు మానవులు గురికావడం, విద్యుత్ స్తంభాలపై నుంచి పడిపోవడం వంటి ప్రమాదాలు తగ్గుతాయి.
*పవర్‌కట్ లేకుండానే వేగంగా మరమ్మతులు పూర్తి అవుతాయి.
*మానవులకంటే ఎక్కువ కచ్చితంగా, అలసట లేకుండా పనిచేస్తాయి.
*దీర్ఘకాలంలో లేబర్ విద్యుత్ రంగంలో వృథా ఖర్చులు, నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయి.
*రోబోలు పగలు, రాత్రి, చలి, వర్షం, ఎండ ఏ విధమైన వాతావరణంలోనైనా పనిచేయగలగడంతో విద్యుత్ మరమ్మతులలో ఆలస్యం, నిర్లక్ష్యం వంటివి ఉండవు.






